Telangana: తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలనమైన గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు గ్యాస్ సిలిండర్ 500 ఫైరూపాయలకే ప్రవేశపెట్టింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మరియు రైతు భరోసా పథకాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్యకాలంలో కిడ్నీ డయాలసిస్ పేషంట్ల సంఖ్య మరింత పెరిగిందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,021 మంది డయాలసిస్ రోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతినెల రూ.2,016 పెన్షన్ మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పూర్తి అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 4,021 కిడ్నీ రోగులకు మే నెలలో పెన్షన్ మంజూరు చేసింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారు నిత్యం ఆస్పత్రులకు వెళ్లి డయాలసిస్ ప్రక్రియ చేయించుకోవలసి ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లు ప్రతివారం ఆస్పత్రికి వెళ్లాలి. లేదంటే వాళ్ల ప్రాణానికే ప్రమాదం. ఈ క్రమంలో ఇటువంటి కిడ్నీ రోగులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి పెన్షన్ మంజూరు చేయడం వంటి కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇది చాలా చారిత్రక నిర్ణయంగా నిలిచింది.