India Post: తపాల శాఖ మరో ముందడుగు.. డిజిటల్ సేవలు అందుబాటులోకి.. ఎప్పటి నుండి అంటే

India Post
India Post

India Post: దేశవ్యాప్తంగా అనేక పోస్ట్ ఆఫీస్ లలో కోట్లాదిమంది కస్టమర్లు ఖాతాను ఓపెన్ చేశారు. అయితే ఇకపై పోస్ట్ ఆఫీస్ లలో కూడా నగదు ద్వారా జరిగే చెల్లింపుల విధానానికి స్వస్తి పలికి డిజిటల్ లావాదేవీలకు మార్గం సులభం చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ వారు 2025 ఆగస్టు నాటికి మనదేశంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ లలో కూడా యూపీఐ సంబంధిత చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు తర్వాత రాబోయే ఆధునిక మార్పులతో పోస్ట్ ఆఫీస్ లో ఉన్న వినియోగదారులందరూ కూడా పోస్టల్ సేవలను ఇకపై సులభంగా మరియు సురక్షితంగా క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు.

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సాంకేతిక వ్యవస్థకు యూపీఐతో అనుసంధానం చేయబడిలేదు. దీంతో తపాలా శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థను ఐటి 2.0 పేరుతో అప్ గ్రేడ్ చేసి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీంతో పోస్ట్ ఆఫీస్ లో ఇకపై ఈ కొత్త టెక్నాలజీ ద్వారా వినియోగదారులు ప్రతి లాభాదేవికి ప్రత్యేకంగా ఒక డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేయబడుతుంది. పోస్టల్ శాఖ వినియోగదారులు తమ ఫోన్ లో ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలను పూర్తి చేయవచ్చు.

ఈ కొత్త టెక్నాలజీని దేశంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులలో కూడా అమలు చేసే ముందు పోస్టల్ శాఖ వారు ముందుగా కర్ణాటకలో మైసూర్ అలాగే బాగలకోట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న చిన్న చిన్న పోస్ట్ ఆఫీస్ లలో పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించారు. పోస్టల్ శాఖ వారు ఈ ప్రయోగంలో భాగంగా చేసిన మెయిల్ ప్రోడక్టుల బుకింగ్ కోసం పోస్ట్ ఆఫీస్ లలో క్యూఆర్ కోడ్ చెల్లింపులను చాలా విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం ఆధారంగా త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ లలో కూడా ఈ నూతన టెక్నాలజీని పోస్టల్ శాఖ వారు అందుబాటులోకి తీసుకొని రానున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now