Kamareddy: కళాకారులు సంస్కృతి పరిరక్షకులు

Kamareddy
Kamareddy

* సంస్కార భారతి ఆధ్వర్యంలో కళాకారులకు సత్కారం

Kamareddy: కామారెడ్డి, జూలై 12 (ప్రజా శంఖారావం): కళాకారులు సంస్కృతి పరిరక్షకులని ప్రముఖ హైకోర్టు న్యాయవాది నెల్లుట్ల విజయ్ కుమార్ అన్నారు. శనివారం సంస్కార భారతి కామారెడ్డి ఆధ్వర్యంలో నటరాజ పూజా (గురుపూజ) కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ హౌసింగ్ బోర్డ్ నందు నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ జానపద కళాకారులు రెడ్డి రాజయ్య, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారులు వంశీ ప్రతాప్ గౌడ్, శాస్త్రీయ సంగీత కళాకారులు సుహాసినికి వారి శిష్యులచే ఘనంగా పూలమాల వేసి శాలువాతో సత్కారించి గురుపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ హైకోర్టు న్యాయవాది నెల్లుట్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ వైభవాన్ని వివరిస్తూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈనాటి యువతదేనని ఉద్బోధించారు. అధ్యక్షులు డా. సమ్మిరెడ్డి మాట్లాడుతూ గురువులను సత్కరించుకోవడం వారి శిష్యుల అదృష్టం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి రాజయ్య బృందం జానపద గేయాలు పాడి అందరినీ ఉర్రూతలూగించారు. వంశీ ప్రతాప్ గౌడ్ శిష్యుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారిణి సుహాసిని శిష్య బృందం శాస్త్రీయ సంగీతం ఆలపించి శ్రోతలకు ఆహ్లాదాన్ని పంచారు. శిష్యుల ప్రదర్శనలు చూసిన గురువులు గర్వంగా ఉందని శిష్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాతూరి సత్య ప్రసాద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి డా.ఎన్ రాజు, కార్యదర్శులు సాయిబాబా, స్వామి గౌడ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now