Astrology: ఈ వస్తువులను ఈవారం అసలే కొనకండి.. లేదంటే ఆర్థిక పరిస్థితి ఇక అంతే.. శాస్త్రం ప్రకారం..
ఇంటిలోకి ఒక కొత్త వస్తువు కొంటున్నామంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అంతే కాదు శాస్త్ర ప్రకారం ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పద్దతి ఉంటుంది. అన్ని వస్తువులు కుటుంబానికి కలిసి రావు. కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సంతోషంగా గడపాలంటే వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అయితే శనివారం మాత్రం ఈ వస్తువులు అసలే కొనరాదు. కొంటె మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారి పోతుందో చెప్పలేమంటున్నారు వేద పండితులు.
శనివారం వంట నూనె వస్తువులను అసలే కొనరాదు. అదే విదంగా అదేరోజు చీపురు కూడా కొనరాదు. ఈ రెండు వస్తువులను శనివారం కొంటె ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం ఖాయం.
ఉప్పు శనివారం కొనరాదు. మరో రోజు కొని శనివారం తీసుకురారాదు. ఆ విదంగా చేయడం వలన అప్పులు పెరిగిపోతాయి. అంతే కాదు ఉన్న అప్పులు కూడా తీరవు.
నల్ల నువ్వులు, నల్ల మినప పప్పు శనివారం కొనరాదు. ఒకవేళ ఇతర రోజుల్లో మరో ప్రాంతంలో కొని శనివారం నల్ల నువ్వులు, మినిములు ఇంటికి తీసుకురారాదు. శనివారం నువ్వులు, మినప పప్పు కొంటె చేయాల్సిన పనులు ఆలస్యం అవుతాయి. శనివారం నువ్వులు, మినిములు దానం చేస్తే శుభం కలుగుతుంది. శనివారం ఇనుప వస్తువులు అసలే కొనరాదు. కొంటె దురదృష్టాన్ని కొనుకున్నటు అవుతుందని వేదం పండితులు చెబుతున్నారు.