Telangana: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతటా ఉంది. కానీ హైదరాబాద్ లో చాలా ఎక్కువ రియల్ రంగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కాబట్టి రియల్ వ్యాపారంలో చాలా మంది పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ హైదరాబాద్ లో రియల్ రంగంలో పెట్టుబడి పెట్టె ముందు చాలా జాగ్రత్తలు తీసుకుకోవాలని హైడ్రా కమిషన్ తాజాగా ప్రకటించింది. ఇంటి స్థలం, ఇండిపెండెంట్ ఇల్లు, ప్లాట్ కొనుగోలు చేసేముందు పూర్తిగా వివరాలు తెలుసుకున్న తరువాతనే కొనుగోలు చేయాలనీ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు.
ప్రభుత్వ, ఆక్రమణలకు గురైన భూముల్లో కట్టిన అపార్ట్మెంట్, ఇల్లు కొనుగోలు చేయరాదని రంగనాథ్ కోరారు. అటువంటి స్థలాల్లో నిర్మించిన కట్టడాలను కొనుగోలు చేసిన వారి ఆస్తులను కూలగొట్టడం తప్పదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా పనిచేస్తుందన్నారు.
కట్టిన ఇల్లు, అపార్ట్మెంట్ లో ఇల్లు, ఖాళీ స్థలం కొనుగోలు చేయడానికి ముందు వాటి సమీపంలో చెరువులు, కాలువలు ఉంటె సరిచూసు కోవాలన్నారు. కొనడానికి ముందు అటువంటి ఆస్తులపై న్యాయవాదితో న్యాయ సలహా తీసుకోవాలన్నారు కమిషనర్. అక్రమ సంబందిచిన కట్టడాలపై ప్రజావాణిలో ఇప్పటి వరకు 47 ఫిర్యాదులు అందాయన్నారు.