Metpally: పల్లెల్లో జోరందుకున్న.. బెల్ట్ షాపుల వేలం పాటలు..!

Metpally
Metpally

* విడిసిలో ఆధ్వర్యంలో బెల్ట్ షాపుల వేలం పాటలు..?
* మమ్మల్ని అడ్డుకునేది ఎవరు..? ఆపేదెవరు..?
* ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారుల నిస్సహాయత నిజమేనా..?
* పల్లెల్లో బెల్టులకు అడ్డుకట్ట వేయలేరా..?

Metpally: మెట్ పల్లి/ఇబ్రహీంపట్నం, జూన్27 (ప్రజా శంఖారావం): ఇబ్రహీంపట్నం మండలం గోదావరి పరివాహక గ్రామాల్లో ఒకే రోజు మూడు గ్రామాల్లో బెల్ట్ షాప్ లకు వేలం పాటలు జరిగినట్లు సమాచారం. రెండు గ్రామల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (విడిసి) లు అనుకున్న ధర రాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. కానీ ఓ గ్రామంలో మాత్రం వారు అనుకున్న వేలంపాట రావడంతో సదరు వేలంపాటలో పాల్గొన్న వ్యక్తికి బెల్ట్ షాపు పెట్టుకోవడానికి దర్జాగా వీడిసి వారు అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. దీనికి ఏకాభిప్రాయం రావడానికి ముఖ్య కారణం గోదావరికి మొక్కులు చెల్లించుకునేందుకు పలు జిల్లాల నుండి భక్తులు వేలాదిగా ఆ గ్రామానికి భక్తులు, స్థానికులు వస్తుంటారు.

కాబట్టి ఈ చాన్స్ మిస్ అయితే మళ్ళీ వేలంపాట నిర్వహించకపోయిన పీడీసీకి నష్టం వస్తుందని కాబోలు వారు అనుకున్న వేలంపాటను కానిచ్చేసారు. ఆ గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి మొక్కులు చెల్లించిన అనంతరం మందు సేవించే ఆనవాయితీ అక్కడ మొక్కుకు చెల్లింపులో భాగంగా ఉంటుంది. కాబట్టి వీడిసి నిర్వహించిన ధరకు వేలంపాట దక్కించుకుంటే లాభాలు గడించొచ్చని వేలంపాటలో పాల్గొన్న వారి అభిప్రాయం అనుకుంటా మరి. అందుకని ఏకంగా 4 లక్షలకు ఆ గ్రామంలోని గత పాలనలో ఉన్న గ్రామ ద్వితీయ పౌరుడిగా ఉన్న వ్యక్తి వేలం పాటను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

అడవిలో బెల్ట్ షాప్ అనుమతికి అంత సిద్ధమా..!

బెల్ట్ షాపు వేలం పాటలో నాలుగు లక్షలకు దక్కించుకున్న ఆ గ్రామంలో వచ్చే ఆదివారం వ్యవసాయం, ఇతర వ్యాపారాలు, ఆరోగ్యాలు బాగుండాలని అడవి తల్లికి మొక్కు చెల్లించుకునేందుకు గ్రామంలో చిన్నా, పెద్ద, బంధువులు అంతా గ్రామం వీడి అడవి దేవత వద్ద మొక్కులు చెల్లించుకుని అక్కడే వంట వార్పు చేసుకుని తిని మిగిలిన వాటిని అక్కడే వదిలేసి వచ్చే సంప్రదాయం ఉందని గ్రామస్తులు తెలిపారు. ఇదే అవకాశంగా భావించి బెల్ట్ షాప్ వేలంపాట దక్కించుకున్న వారు అక్కడికి మద్యాన్ని ఓ ట్రాక్టర్ లలో ఐస్ బాక్స్ లు వేసుకుని మరి అడవిలోనే అధిక ధరలకు అమ్మకాలు జరుపుతుంటారని సమాచారం. ఏకంగా ఒకేరోజు దాదాపు లక్ష నుండి 2 లక్షల రూపాయల విలువ చేసే మద్యం అమ్మకాలు జరుగుతాయని తెలుస్తుంది.

దర్జాగా విడిసి సభ్యులు వేలంపాట నిర్వహించడం, భక్తులు నమ్మకంతో అడవి తల్లి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వారికి లక్షల రూపాయల మద్యం అమ్మకాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతూ ఉంటే జిల్లా యంత్రాంగానికి ఈ తతంగం తెలియదా అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవేళ అధికారులకు తెలిసిన ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో జిల్లా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు ఉన్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక ఎక్సైజ్, పోలీస్ అధికారులకు తెలిసే ఈ తతంగం నిర్వహిస్తున్నారా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం డ్రగ్స్, గంజాయి, మద్యపానం లాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే పల్లెల్లో మాత్రం యథేచ్చగా వీడీసీ లు బహిరంగంగా వేలం పాటలు నిర్వహిస్తూ ఉండడంపై జనాలు ఇదేమి చోద్యమని ముక్కున వేలుసుకుంటున్నారు.

మరి జరిగిన షాపుల వేలం పాట ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న బెల్టు షాపు నిర్వాహకులు, వారికి సహకరించిన సంబంధిత శాఖ అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now