Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ లో బెస్ట్ స్కీమ్.. పెట్టుబడి పెట్టండి.. ప్రతినెల ఆదాయం పొందండి

Post Office Schemes
Post Office Schemes

Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ లో బెస్ట్ స్కీం, ప్రతినెల చక్కని ఆదాయం పొందే అద్భుతమైన స్కీం వివరాలు మీకోసం.. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం వలన మీరు ప్రతి నెల ఎటువంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం పొందవచ్చు. మెచ్యూరిటీ సమయం వరకు ఈ స్కీమ్ లో మీరు ప్రతి నెల ఆదాయం అందుకోవచ్చు. ఎటువంటి రిస్క్ లేకుండా మీ డబ్బులు సురక్షితంగా ఉండి మీరు ప్రతి నెల ఆదాయం పొందాలంటే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మంత్లీ ఇన్కమ్ స్కీము చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ తర్వాత నెల నెల ఆదాయం పొందాలని భావిస్తున్న వారికే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సురక్షితమైన పెట్టుబడిలో కోసం పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్కీమ్స్ లో మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. 5 ఏళ్లకు ఒకసారి ఈ స్కీమ్ లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ పూర్తి అయ్యే సమయం వరకు మీరు నెల నెల ఆదాయం తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసర్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మీరు ఒంటరిగా లేదా జాయింట్ గా ఎకౌంటు తెరవచ్చు. అలాగే 10 ఏళ్లు దాటిన పిల్లలకి కూడా ఈ స్కీంలో అర్హత ఉంటుంది. కనీసం గా మీరు ఈ స్కీమ్ లో వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

అయితే ఒకవేళ మీరు ఈ స్కీం లో సింగిల్ ఎకౌంట్ తెరిచినట్లయితే గరిష్టంగా మీరు రూ.9 లక్షలు డిపాజిట్ చేయాలి. జాయింట్ అకౌంట్ మంత్లీ ఇన్కమ్ స్కీం లో మీరు ఓపెన్ చేసినట్లయితే గరిష్టంగా మీరు రూ.15 లక్షలు పెట్టుబడి చేసుకోవచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ వారు ఈ స్కీం కి 7.4% వడ్డీ రేటు అందిస్తున్నారు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి అని గమనించగలరు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now