8th Pay Commission: జాతీయ సిబ్బంది మండలి కమ్యూటెడ్ పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తుంది. ఈ మార్పు కనక జరిగితే ఇప్పటికే పదవి విరమణ పొందిన ఉద్యోగులు త్వరగా పూర్తి పెన్షన్ అందుకోగలుగుతారు. ప్రస్తుతం పదవి విరమణ అయిన 15 సంవత్సరాల తర్వాత కమ్యూటెడ్ పెన్షన్ పూర్తిగా పొందుతారు. అయితే ఈ కాలాన్ని 12 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై జాతీయ సిబ్బంది మండలి డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ముందు పెట్టిన ఈ డిమాండ్ చాటర్ లో చాలా కీలకంగా మారనుంది అని తెలుస్తుంది. ఈ డిమాండ్ పూర్తి అయితే కనక ఇప్పటికీ పదవి విరమణ అయిన లక్షల మంది ఉద్యోగులు 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ పొందవచ్చు.
ఉద్యోగులు పదవి విరమణ సమయంలో ఒకేసారి తమ పెన్షన్ లో కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇక దీనినే కమ్యూటెడ్ పెన్షన్ అని అంటారు. ప్రతినెలా వచ్చే పెన్షన్ లో నుంచి దీనిని లెక్కించి ఒక నిర్దిష్ట మొత్తాన్ని కట్ చేస్తారు. అయితే ఇప్పటివరకు ఈ కాల పరిమితి 15 సంవత్సరాలు ఉండేది. 15 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత ఉద్యోగి పూర్తి పెన్షన్ అందుకోగలుగుతాడు. అయితే తాజాగా 15 సంవత్సరాల గడువు చాలా ఎక్కువగా కాలం అవుతుంది అంటూ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షన్ దారులు వాపోతున్నారు. ఆర్థిక నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు.
వడ్డీ రేట్లు కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోవడంతో కట్ చేసే ఫార్ములా మాత్రం పాతదే ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తీసుకున్న ముందస్తు మొత్తానికి రెట్టింపు పోగొట్టుకున్నట్లు చెప్తున్నారు.దీంతో ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఈ కాల పరిమితిని 12 ఏళ్లకు తగ్గిస్తే పదవి విరమణ పొందిన తక్కువ సమయంలోనే వాళ్లు పూర్తి పెన్షన్ అందుకోగలుగుతారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో పెరుగుతున్న బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు వంటి నేపథ్యంలో ఈ డిమాండ్ పూర్తయితే అది పెన్షన్ లబ్ధిదారులకు పెద్ద ఊరట కలిగిస్తుంది అని చెప్పొచ్చు.