WhatsApp Blue Tick: ఈ మధ్యకాలంలో చాలామంది వాట్సాప్ లో బ్లూ టిక్ పొందుతున్నారు. అయితే దీనిని పొందడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార ఖాతా ఉన్నవారికి మాత్రమే వాట్సాప్ బ్లూటిక్ పొందే అవకాశం ఉంటుంది. వాట్సాప్ లో మీ ఖాతా కార్యాచరణ మరియు అందించిన ముఖ్యమైన డాక్యుమెంట్ల ఆధారంగా మీకు వాట్సాప్ లో బ్లూటిక్ అందుతుంది. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కూడా మీరు బ్లూ టిక్ పొందవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఒక వ్యక్తి ఖాతాను ధ్రువీకరించబడినది అనేదానికి అర్థం ఆ వ్యక్తి ఖాతాకు ఉండే బ్లూ టిక్. సోషల్ మీడియా ఖాతాలు ఫేస్బుక్, ఎక్స్ మరియు ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో కొంతమంది వ్యక్తులు బ్లూటిక్ పొందుతారు.
అయితే వాట్సాప్ లో కూడా బ్లూటిక్ పొందవచ్చు అనే సంగతి చాలా మందికి తెలియదు. కానీ వాట్సాప్ లో బ్లూటిక్ పొందడం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది ఎలా పొందాలో తెలుసుకోవడం చాలా అవసరం. అయితే కేవలం వ్యాపార ఎకౌంటు ఉన్నవారికి మాత్రమే వాట్సాప్ లో బ్లూటిక్ ఇస్తారు. వాట్సాప్ లో మీ యాక్టివిటీ మరియు అవసరమైన పత్రాలు ఆధారంగా మీ వాట్సాప్ ఖాతా ధ్రువీకరుస్తారు. చెల్లించిన నెలవారి సభ్యత్వం మరియు ధ్రువీకరించబడిన బ్యాచ్ అలాగే ఖాతా మద్దతు, ఖాతా రచన వంటి మొదలైన అనేక రక్షణాలతో మెటా వెరిఫికేషన్ జరుగుతుంది.
బ్యాంక్స్, ఈ కామర్స్ కంపెనీలు వ్యాపారం చేసే సంస్థలకు ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే న్యూస్ చానల్స్, సెలబ్రిటీలకు మొదలైన వారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు, పథకాలకు కూడా ఇది ఉపయోగించవచ్చు. దీనికోసం మీరు దరఖాస్తు చేసుకోవడానికి వాట్స్అప్ బిజినెస్ యాప్ ఓపెన్ చేయండి. మీకు కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి ఆ తర్వాత సెట్టింగ్లలో వెళ్ళండి. దానిపై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత టూల్స్ కి వెళ్లి మెటా వెరిఫైడ్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని ఎంపిక చేసుకొని ఆపై చెల్లింపున పూర్తి చేయండి. ఇది పొందాలంటే మీకు ధర రూ.639 నుంచి రూ.18,900 వరకు ఉంటుంది.