Bonalu: బోనాల జాతరకు మొత్తం నగరం రెడీ అయింది. నెల రోజులపాటు జరిగే ఈ బోనాల ఉత్సవాలకు మొత్తం నగరం ముస్తాబయింది. నగరంలో ఉన్న ఆలయాలు అన్నీ కూడా పసుపు, కుంకుమలతో రూపుదిద్దుకున్నాయి. బోనాల జాతర కోసం ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఒక నెల రోజులపాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని ఆలయాలు కూడా పసుపు మరియు కుంకుమలతో రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రతీకగా ఉండే బోనాల పండుగ ఉత్సవాలు ఈరోజు నుంచి మొదలుకానున్నాయి. అయితే హైదరాబాదులో గోల్కొండ కోట పై ఉన్న జగదాంబికా అమ్మవారికి తొలిరోజు పూజ నిర్వహించి బోనాల పండుగను ప్రారంభించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.
ఇక కోటలో చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఒక నెల రోజులపాటు ప్రతి గురు మరియు ఆదివారం రోజున 9 పూజలను నిర్వహిస్తారు. చాలా శతాబ్దాల నుంచి లంగర్ హౌస్ వాసుల చేతుల మీదుగా బోనాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దీనిని లంగర్ ఖానా అని కూడా పిలిచేవారు. లంగర్ అంటే వంట. ఖానా అంటే గది. అప్పట్లో వంట గదులు ఉండేవి కాదు కాబట్టి ఆహార ధాన్యాలను భాండాగారాల్లో దాచి రాజులకు అలాగే సైనికులకు కూడా లంగర్ హౌస్ నుంచి ఆహారాన్ని వండి పంపించడం జరిగేది. ఆ సమయంలో ఇక్కడి నుంచే అమ్మవారికి నైవేద్యాన్ని కూడా వండి పంపించడం ఆనవాయితీగా వస్తుంది.
ఇక మంత్రులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి లంగర్ హౌస్ లో ఊరేగింపును ప్రారంభించడం జరుగుతుంది. మొదటి పూజలో చోటా బజార్ లోని ప్రధాని పూజారి ఇంటి దగ్గర నుంచి పూజలను మొదలుపెట్టి బోనాలతో అమ్మవారిని పల్లకిలో ఊరేగించిన తర్వాత కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించడం జరుగుతుంది. ఉత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొహయుద్దీన్, నగర పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్, మేయర్ విజయలక్ష్మి తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు.