Bonalu: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

Kamareddy
Kamareddy

Bonalu: కామారెడ్డి, జూలై 13 (ప్రజా శంఖారావం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ అని పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. ఆదివారం పట్టణంలోని 8 వ వార్డు జి.ఆర్ (గోష్క రాజయ్య) కాలనీవాసులు నిర్వహించిన మైసమ్మ బోనాల ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ ఆడపడుచులు అందంగా ముస్తాబు చేసిన బోనాలను నెత్తిన పెట్టుకొని డప్పుచప్పులతో ఆడుతూ ప్రదర్శనగా వెళ్లి మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.

Also Read: కళాకారులు సంస్కృతి పరిరక్షకులు

బోనాల ఊరేగింపులో బోనమెత్తి నృత్యం చేసిన మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారికి బోనాలలో ఉన్న నైవేద్యాన్ని సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని కాలనీవాసులు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యదర్శి స్వామి, కోశాధికారి మురళీ, రాములు, సంజీవ్, సత్యనారాయణ గౌడ్, హరినాథ్ రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు.

Also Read: రాజకీయ కక్షతో తప్పుడు కేసులో ఇరికించారు

 

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now