Warren Buffett: బెర్క్ షైర్ హాత్వే సీఈవో వారన్ బఫెట్ గురించి చాలామందికి బాగా తెలుసు. ఇతను జీవితంలో విజయవంతమైన ఒక గొప్ప ఇన్వెస్టర్ మాత్రమే కాదు సంపాదనలో తిరుగులేని శక్తిగా కూడా నిలిచారు. బఫెట్ కు దాతృత్వంలో కూడా ఎవరు సాటి లేరు. తాజాగ బఫెట్ అయిదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలకు ఏకంగా ఆరు బిలియన్ డాలర్ల అంటే సుమారు 50 వేల కోట్లు విలువైన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు బఫెట్ వయస్సు 94 ఏళ్ళు. ఆయన తాజాగా బిల్ అండ్ మిగిలిందా గేట్స్ ఫౌండేషన్కు ఏకంగా 9.43 మిలియన్ల బేర్ షేర్ షేర్ లను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఆయన తన దివంగత భార్య సుశాన్ థామ్సన్ బఫెట్ ఫౌండేషన్కు కూడా తన భార్య పేరు మీద 9,43,384 షేర్లను ఇచ్చారు. అలాగే తన ముగ్గురు పిల్లల పేర్ల మీద ఉన్న స్వచ్ఛంద సంస్థలు కోవార్డు జీ బఫెట్ ఫౌండేషన్, షర్వుడ్ ఫౌండేషన్ అలాగే నోవో ఫౌండేషన్లకు ఏకంగా 6,60,366 షేర్లను విరాళంగా ప్రకటించారు. గతంలో కూడా ఈయన కలిసి స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలను అందించారు.
గత ఏడాది జూన్ నెలలో 5.3 బిలియన్ డాలర్లు అలాగే నవంబర్ నెలలో 1.14 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. తాజాగా ఐదు స్వచ్ఛంద సంస్థలకు ఈయన ఇచ్చిన భారీ విరాళం తర్వాత కూడా ప్రపంచంలో అత్యంత ధనవంతులలో బఫెట్ ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఈ విరాళానికి ముందు ఈ ఏడాది ఆయన నికర సంపద 152 బిలియన్ డాలర్స్. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ధనవంతులలో బఫెట్ ఐదవ స్థానంలో ఉన్నారు. ఇక ఈ విరాళం ఇచ్చిన తర్వాత అయినా ఆరవ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది