Nardisthi: ఒక వ్యక్తి మరొక వ్యక్తి పై చూపించే అసూయ లేదా ప్రతికూల ఆలోచనలను నరదిష్టి అని అంటారు. ఎదుటి వ్యక్తి కి ఉండే వస్తువులకు గాని లేదా అతని సాధించిన విజయానికి గాని వేరొక వ్యక్తి చూపించే అసూయ నరదిష్టి. అయితే నరదిష్టి కారణంగా ఒక వ్యక్తి ఎదుగదలలో అడ్డంకులు రావడం అలాగే ఆరోగ్యపరంగా లేదా కెరియర్ పరంగా, వ్యాపారంలో, వైవాహిక జీవితంలో గొడవలు ఇలా చెడు ప్రభావం కలుగుతుంది. ఈ విధంగా నరదిష్టి కలగడం వలన కొంతమందికి విజయం చేతికి వచ్చినట్టే వచ్చి చేజారి పోతుంది. అయితే కొన్ని నియమాలను పాటించడం వలన ఈ నర దిష్టి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
ఒకవేళ మీకు నర దిష్టి తగిలిందని అనిపించినట్లయితే మీరు ప్రతి శనివారం రోజున మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర లేదా మీరు వ్యాపారం చేసే చోట ఏడు మిరపకాయలతో పాటు ఒక నిమ్మకాయను నల్ల దారానికి కట్టి వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు. కానీ వారానికి ఒకసారి ఈ విధంగా వేలాడదీసిన నిమ్మకాయ, మిరపకాయల దండను మారుస్తూ ఉండాలి. నరదిష్టి పూర్తిగా పోవాలంటే ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. దీనికోసం ఒక గాజు గిన్నెలో మీరు ఉప్పు లేదా పటికను తీసుకొని ఇంట్లో ఈశాన్యం మూలలో పెట్టాలి.
Also Read: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులను వేలాడదీస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది
ఇది ప్రతికూల శక్తిని ఆకర్షించే చెడు దృష్టి ఇంట్లో లేకుండా చేస్తుంది. పది రోజులకు ఒకసారి ఈ విధంగా ఇంట్లో ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. అలాగే ఇంటి ముందు ఉన్న ఆవరణలో పచ్చటి మొక్కలు ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో చెడు దృష్టి ఉన్నట్లు మీకు అనిపిస్తే మీ ఇంటి ముందు ఆవరణలో లేదా ఈశాన్య దిశలో ఒక తులసి మొక్కను పెట్టుకోవాలి. అలాగే ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్, కలబంద వంటి మొక్కలను కూడా నాటడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి.