ఇక జూన్ 14వ తేదీ శనివారం రోజున సంకష్ట చతుర్థి ఉదయ తిధితో అందరూ జరుపుకుంటారు. జూన్ 14వ తేదీ రాత్రి 10:07 గంటలకు చంద్రోదయ సమయం ఏర్పడుతుంది. చాలామంది జూన్ 14 ప్రత్యేక రోజున వినాయకుడిని పూజించినట్లయితే వాళ్ల జీవితంలో ఉన్న సర్వవిజ్ఞాలు కూడా తొలగిపోతాయి అని నమ్ముతారు. ముఖ్యంగా గణేశ పురాణంలో అనేక కథల రూపంలో కృష్ణ పింగళి సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే అనేక లాభాలను వివరించారు.
కాబట్టి ఈ ప్రత్యేక రోజున వినాయకుడిని పూజించినట్లయితే తమ జీవితంలో ఉన్న పుత్ర సంతాన ప్రాప్తి, వికలాంగ దోష నిర్మూలనము, బ్రహ్మహత్య పాతక నాశనము, రాజ్య ప్రాప్తి లేదా కుజదోషం ఇలా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వివాహాలకు ఆటంకాలను తొలగించేలా, సంతానాన్ని ప్రసాదించేలాగా అలాగే దూరమైన బంధువులను తిరిగి దగ్గర చేసేలాగా జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే వాటిని పోగొట్టేలాగా కూడా ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ ప్రత్యేక రోజున భక్తులు అందరూ కూడా ఉపవాసం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉండి చంద్రుడిని పూజించిన తర్వాత ఉపవాస దీక్ష ముగించాలి అని పండితులు వివరిస్తున్నారు.