Health Tips: ఉదయం, సాయంత్రం పూట టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ రోజుల్లో టీ తయారు చేసేటప్పుడు కొందరు అల్లం, మరికొందరు శొంఠి, ఇంకొందరు మిరియాలు, లేదంటే ఇలాచీ ఇలా రకాల మాసాల దీనిసులు వేసి చాయ్ తాగుతున్నారు. వీటిలో ఏది కలుపుకొని తాగినా శరీరానికి మేలు చేస్తాయి. ఇటీవల కొందరు దాల్చిన చెక్క తో టీ తయారు చేసుకొని తాగుతున్నారు. కానీ దాని వలన శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలియదు. ఆరోగ్య నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు…..
దాల్చిన చెక్క టీ లో కలుపుకొని తాగడం వలన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రక్తపోటు అదుపులోకి వస్తుంది. షుగర్ ఉన్నవారికి చాలా మేలు కలుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి కూడా అదుపులోకి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ దాల్చిన చెక్కతో టీ తాగితే అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. గర్భాశయానికి రక్త సరఫరాలో చురుకుగా పనిచేస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. తిన్నటువంటి ఆహార పదార్థాలు సక్రమంగా జీర్ణమవుతాయి. శరీరం ఉల్లాసంగా ఉంటుంది. తలనొప్పితో బాధపడేవారు దాల్చిన చెక్కతో తయారైన టీ తాగితే నయమవుతుంది. పేగుల్లో ఉన్నటువంటి మలినాలు తొలగిపోతాయి. మూత్రాశయంలో ఉన్నటువంటి మలినాలు తొలగిపోతాయి.