Health Tips: మసాలా దినుసులు రుచి కోసం మాంసాహారం వంటకాల్లో ఉపయోగిస్తాం. కూరలు రుచిగా ఉంటాయి. సువాసన కూడ ఉంటుంది. మసాలా దినుసుల్లో మంచి సువాసన అందించే గుణం ఉన్న ఆహార పదార్థము ఇలాచీ అని ఎవరైనా చెప్పేస్తారు. ఇలాచీ ని వంటకాల్లో వాడుతామనే తెలుసు. కానీ ఆహార పదార్థంగా వాడితే శరీరానికి ఎంత మేలు చేస్తుందో చాలా తెలియదు. ఇలాచిని ఉదయం పూట గోరు వెచ్చని నీటిలో కానీ తేనెలో కానీ కలుపుకొని తాగితే శరీరం ఎంతో ఆరోగ్యముగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చని నీటిలో గాని, తేనే, గోరువెచ్చని నీరు, ఇలాచీ కలుపుకొని తాగితే గొంతులో ఉన్న మలినాలు తొలగిపోతాయి. నోటి దుర్వాసన తొలగిపోతుంది. దంతాలు రంగు మారవు. పేగుల్లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
ఆహార పదార్థాలు జీర్ణమవుతాయి. పేగుల్లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. షుగర్ వ్యాధి ఉన్నవారికి అదుపులోకి వస్తుంది. నిత్యం తలనొప్పి ఉన్నవారికి నయమవుతుంది. చర్మం ప్రకాశ వంతంగా తయారవుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. నిద్రకు ఇబ్బందులు కలుగవు.