Number Plates: దేశంలో ఉన్న ప్రతి వాహనానికి కూడా రవాణా శాఖ నియమాల ప్రకారం నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా వాహనం నడిపిస్తూ కనిపిస్తే పోలీసులు జరిమానా విధిస్తారు. రవాణా శాఖ వాహనం నడుపుతున్న వారిని సులువుగా గుర్తించేందుకు ప్రతి ఒక్కరికి విభిన్నమైన నెంబర్ ప్లేట్లను తీసుకొని వచ్చింది. ఒక నెంబర్ ప్లేట్ ఒక్కో రంగులో ఉంటాయి. రవాణా శాఖ సంయుక్త కార్యదర్శి రమేష్ నెంబర్ ప్లేట్లకు ఉండే ఒక రంగు గురించి ఉన్న ప్రత్యేకతలను వివరించారు. తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ను వ్యక్తిగత వాహనాలకు వాడతారు. తెలుపు రంగు నెంబర్ ప్లేటును వాణిజ్య ప్రయోజనాలకు అస్సలు వాడకూడదు.
పసుపు రంగు నెంబర్ ప్లేటును ఆటోలు అలాగే టాక్సీలు వంటి ప్రయాణికులను ఎక్కించుకునే వాహనాలకు మాత్రమే వాడతారు. వీటికి టాక్స్ విధానం కూడా ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు ఉన్న నెంబర్ ప్లేట్ ను ఈవీలో వాడతారు. పైకి సూచించే బాణం గుర్తు ఉన్న నెంబర్ ప్లేట్లను ముఖ్యంగా సైనిక అవసరాలకు ఉపయోగిస్తారు. రక్షణ శాఖ పేరు మీద ఇటువంటి నెంబర్ ప్లేట్లు రిజిస్టర్ అయ్యి ఉంటాయి. మొదటి లేదా రెండో అక్షరం తర్వాత ఇటువంటి నెంబర్ ప్లేయర్లలో బాణం గుర్తు ఉంటుంది. ఇక బాణం గుర్తు తర్వాత ఉన్న నంబర్స్ వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని సూచించడం జరుగుతుంది.
బాణం గుర్తు తర్వాత రెండు అంకెలు ఆ తర్వాత బేస్ కోడ్ సీరియల్ నెంబరు అనేది నెంబర్ ప్లేట్ మీద ఉంటాయి. చివరిగా ఉన్నవి ఆ వాహనం క్లాస్ ను తెలియజేస్తాయి. ఇటువంటి రంగు ఉన్న నెంబర్ ప్లేట్లను గవర్నర్, రాష్ట్రపతి వంటి వాహనాలకు మాత్రమే ఉపయోగిస్తారు. రాష్ట్రపతి, గవర్నర్ల వాహనాలకు ఎరుపు రంగు నెంబర్ ప్లేట్లు ఉపయోగించడం జరుగుతుంది. ఈ నెంబర్ ప్లేట్ మధ్యలో జాతీయ చిహ్నం కూడా ఉంటుంది. విలాసవంతమైన హోటల్‌కు సంబంధించిన వాహనాల నెంబర్ ప్లేట్లలో నలుపు రంగు నెంబర్ ప్లేట్ ను ఉపయోగిస్తారు. హోటల్ వాహనాలను నడిపేటప్పుడు డ్రైవర్లకు వాణిజ్య లైన్స్ ఉండాల్సిన అవసరం ఉండదు. విదేశీ దౌత్య వేత్తలు నీలం రంగు ఉన్న నెంబర్ ప్లేట్లను వాహనాలకు ఉపయోగిస్తారు.