Chanakya Niti: ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో జీవితంలో మనిషి విజయం సాధించడానికి చాలా ఉపయోగపడే ఎన్నో విధానాలను అలాగే నియమాలను కూడా పేర్కొన్నాడు. మనిషి వ్యక్తిగత జీవితానికి, వైవాహిక జీవితానికి అలాగే అలవాట్లకు సంబంధించిన అనేక విషయాల గురించి కూడా నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు వివరించాడు. ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే అతను తప్పకుండా ఈ విధానాలను అనుసరించాలి. నీతి శాస్త్రంలో అనేక రంగాలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. మనిషి అలవాటు చేసుకునే ఈ విషయాలు అతను చనిపోయే వరకు కూడా అతనిని విడిచి పెట్టవు.
ఒక మనిషికి జ్ఞానం అనేది ఒక అతిపెద్ద ఆయుధంగా పనిచేస్తుంది. మనిషి చనిపోయే వరకు కూడా జ్ఞానం అతనితోనే ఉంటుంది. చాలామంది జీవితంలో మిమ్మల్ని వదిలి పెట్టవచ్చు కానీ జ్ఞానం మాత్రం చివరి వరకు మీతోనే ఉంటుంది. ఒక మనిషి తన తెలివితేటల బలంతో జీవితంలో ఎటువంటి కష్ట పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని చాలా సులభంగా ఎదుర్కోగలడు. అలాగే ఔషధం కూడా మనిషికి చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఆ మనిషికి స్నేహితుడి లాగా పని చేసేది వైద్యం మాత్రమే.
మీరు ఔషధం సహాయంతో ఎటువంటి వ్యాధి నుంచి అయినా లేదా అనారోగ్య సమస్య అయినా సరే చాలా సులభంగా బయటపడవచ్చు. ఒక మనిషి తన మతాన్ని సంపద కంటే ఎక్కువగా భావించాలి అంటూ ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా మతం అతని వెంట వస్తుంది. మతం కర్మ కారణంగా ఒక మనిషి మరణించిన తర్వాత కూడా ఎల్లప్పుడూ అందరి చేత స్మరించబడతాడు.