Check Bounce: చెక్ బౌన్స్ అయితే ఏం జరుగుతుందో తెలుసా.. సిబిల్ స్కోర్ పై ఎఫెక్ట్ ఉంటుందా.. చాలా మందికి తెలియదు.. అదేంటో తెలుసుకోండి..

Check Bounce
Check Bounce

Check Bounce: ఏదో ఒక సందర్భంలో కొంతమంది చెక్ బౌన్స్ వంటి సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఇది చాలా చిన్న సమస్య అని అందరూ అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం చెక్ బౌన్స్ వంటి కారణాల వలన కోర్టుకు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. పదేపదే మీది చెక్ బౌన్స్ అయినట్లయితే ఆ సమస్య మీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. టాటా క్యాపిటల్ నివేదిక ప్రకారం పదేపదే మీ చెక్ బౌన్స్ అయినట్లయితే దాని ప్రభావం మీ సిబిల్ స్కోర్ మీద పరోక్షంగా పడుతుంది. బ్యాంకుల నుంచి లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్ పొందడంలో సిబిల్ స్కోర్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఒకవేళ మీ సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే మీరు లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ లో సకాలంలో చెల్లించలేరు అని బ్యాంకులు భావిస్తాయి. అటువంటి సమయంలో మీకు రుణాన్ని మంజూరు చేయవు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు చెక్ బౌన్స్ కాకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ మీది పదేపదే చెక్ బౌన్స్ అయినట్లయితే బ్యాంకులు మీకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని నిరోధిస్తాయి అలాగే మీకు క్రెడిట్ కార్డ్ పరిమితిని కూడా తగ్గించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో మీ బ్యాంకు ఖాతాను కూడా స్తంభింప చేస్తాయి. ఇది మీ ఆర్థిక లావాదేవీలను కూడా ప్రభావితం చేస్తాయని తెలుస్తుంది.

ముఖ్యంగా వ్యాపారం చేసే యాజమాన్యులకు క్రెడిట్ పరిమితి మీ నగదు ప్రవాహానికి లేదా విక్రేత చెల్లింపులను ప్రభావం చేస్తాయి. ఒకవేళ మీ చెక్ బౌన్స్ కేసు కోర్టుకు వెళ్లినట్లయితే కోర్టు మీకు అనుకూలంగా మాట్లాడదు. ఒకవేళ కోర్టులో మీకు రికవరీ ఆర్డర్ లభించినప్పటికీ అది కనుక విఫలమైతే మీ మీద ఉన్న ఆర్థిక విశ్వాసనీయత దెబ్బతింటుంది. కోర్టు ఇచ్చే తీర్పు మీ సిబిల్ స్కోర్ ను డైరెక్ట్ గా ప్రభావం చేయకపోయినప్పటికీ భవిష్యత్తులో మాత్రం మీరు బ్యాంకుల నుంచి లోన్ పొందడం కష్టమవుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now