Dream Astrology: హిందూమత శాస్త్రంలో స్వప్న శాస్త్రం ప్రకారం మనకు కలలో కనిపించే ప్రతిదీ కూడా మన భవిష్యత్తుకు ఏదో సంకేతం అని పరిగణిస్తారు. అలాగే కొంతమందికి నిద్రిస్తున్న సమయంలో కలలో వర్షం పడడం కనిపిస్తుంది. దీనిని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. హిందూ ధర్మంలో ఉన్న అత్యంత ఆధ్యాత్మిక గ్రంథాలలో స్వప్న శాస్త్రానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. స్వప్న శాస్త్రం అనే పురాతన శాస్త్రంలో మనం నిద్రపోతున్న సమయంలో వచ్చే కళలను అర్థం చేసుకోవడానికి అలాగే భవిష్యత్తులో అవి దేనికి సూచిస్తున్నాయో చెప్పబడింది. మనం నిద్రిస్తున్న సమయంలో చూసే ప్రతి కలపు కూడా ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది అని అవి భవిష్యత్తులో కొన్ని సంకేతాలను ఇస్తాయని స్వప్న శాస్త్రం ప్రకారం చాలామంది నమ్ముతారు.
తరచుగా చాలామందికి వచ్చే కలలలో వర్షం కురవడం కూడా ఒకటి. కలలో వర్షం కురవడం కనిపిస్తే అది చాలా శుభ్రమైనదిగా స్వప్న శాస్త్రం ప్రకారం భావిస్తారు. వర్షం కురవడం కేవలం ఒక ప్రకృతి దృశ్యం మాత్రమే కాదు అది అదృష్టానికి దగ్గర సంబంధం కలిగి ఉందని వారి జీవితంలో త్వరలో సానుకూల మార్పులు జరగబోతున్నాయని అలాగే శుభపరిణామాలు కూడా జరుగుతాయని సూచిస్తుంది. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ప్రాంతంలో ఒక ప్రముఖ ఆచార్య ఆనంద్ భరద్వాజ్ స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం కురుస్తున్నట్లు కనిపించినట్లయితే దీనికి ప్రతీక అని తెలిపారు.
కలలో వర్షం కొరవడం కనిపించడం ఒక మంచి లక్షణం. ఇది భవిష్యత్తులో అనుకూలమైన మార్పులను సూచిస్తుంది అని ఆయన తెలిపారు. వర్షం కురవడం అంటే కొత్తదనం, పరిశుభ్రత మరియు ఎదుగుదలకు సంకేతం అని స్వప్న శాస్త్రం ప్రకారం ఆయన తెలిపారు.ఇటువంటి కలలు చాలా శుభప్రదమైనవిగా భావిస్తున్నారు. ఇలా మీకు కలలో వర్షం కురుస్తున్నట్లు కనిపించినట్లయితే త్వరలో మీరు శుభవార్తలు వింటారని అర్థం. మీ జీవితంలో రాబోయే పెద్ద పెద్ద మార్పులను ఈ కళ సూచిస్తుంది. ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న పనులు అలాగే మీరు ఆశించినా కోరికలు త్వరలో నెరవేరుతాయి అని ఈ కల మీకు సూచిస్తుంది.