Personality Test: ఒక వ్యక్తి నుదుటి లో ఆ వ్యక్తికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉంటాయి అని చాలామంది చెప్తుంటారు. నుదుటిని చూసి ఆ వ్యక్తి ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడో సులభంగా చెప్పొచ్చు. హిందూమత శాస్త్రంలో హస్త సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మరియు శారీరక నిర్మాణాన్ని అంచనా వేయవచ్చు. ముఖం, నుదురు వెళ్ళు మరియు అరికాళ్ళు వంటి వాటిని చూసి ఆ వ్యక్తి మనస్తత్వం ఎలాంటిదో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం మనం ఒక వ్యక్తి నుదురు చూసి అతను ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు తెలుసుకుందాం. నుదుటిలో ఆ మనిషికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉంటాయి.
ఒక మనిషి తెలివితేటలు కూడా అతని నుదురు చూసి చెప్పవచ్చు. అతని జీవితంలో హెచ్చుతగ్గులు, అతని తలరాత మరియు ఆలోచనలు వంటి వాటి గురించి అతని నుదురు సమాచారం ఇస్తుంది. అలాగే నుదుటి రంగు, రేఖలు, వెడల్పు వంటి వాటిని చూసి కొన్ని లక్షణాలను అంచనా వేయవచ్చు. ఎత్తుగా నుదుటి ఉన్న వ్యక్తులు జీవితంలో చాలా ఉన్నత స్థానాన్ని సాధిస్తాడు అని చెప్పవచ్చు. అతను చాలా తెలివైన వ్యక్తిగా చెప్తారు. ఇటువంటి వ్యక్తులు ఏ పని చేయాలన్నా కూడా చాలా ప్రణాళికబద్ధంగా చేస్తారు. నాయకత్వ సామర్ధ్యాలు కూడా ఇటువంటి వ్యక్తులకు ఉంటాయి. కెరియర్ లో చాలా తొందరగా విజయం సాధిస్తాడు. వెడల్పు నుదుటి కలిగిన వ్యక్తులు ప్రశాంత స్వభావాన్ని కలిగిన వారు. వీళ్ళు ఆలోచనలు కూడా చాలా లోతుగా ఉంటాయి. వీళ్లు జీవితంలో చాలా ఆశయాలు సాధించడానికి ఇష్టపడతారు. చిన్న నుదుటి కలిగిన వాళ్లు దేనికైనా సరే చాలా త్వరగా స్పందిస్తారు. ప్రారంభంలో వీరి జీవితం కొంచెం కష్టతరంగా ఉంటుంది.
ఇటువంటి వారికి ఓపిక కూడా చాలా తక్కువ. విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. కొన్ని విషయాలపై వీరి ఆలోచన పరిమితంగా ఉంటుంది అని చెప్పొచ్చు. వీళ్లు చాలా భావోద్వేగానికి గురవుతారు. వాలుగా లేదా నుదుటి వెనుకకు పొంగి ఉన్న వ్యక్తులు భావద్వేగ పరంగా అస్థిరంగా ఉంటారు. ఒకే విషయం మీద వీరు ఏదో ఒకటి చెప్తుంటారు. వీరిలో గందరగోళ భావన ఉంటుంది. నుదుటి యమాకారంలో ఉన్న వ్యక్తులు చాలా ఊహాత్మకంగా, కళాత్మకంగా, సృజనాత్మకంగా ఉంటారు. మంచి మంచి దుస్తులను ధరించే సామర్థ్యం కలిగి ఉంటారు. వీళ్ళు ఇతరులపై మంచి ముద్ర వేయడంలో విజయం అందుకుంటారు. ఇటువంటి వ్యక్తులకు స్వచ్ఛమైన మనసు ఉంటుంది. ఇటువంటి వారు చర్చలకు చాలా దూరంగా ఉంటారు.