Aadhaar Card: ఈ మధ్యకాలంలో మనదేశంలో ఏ పని చేయాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుకు సంబంధిత సెల్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అన్నీ కూడా ఆధార్ కార్డు ద్వారానే లబ్ధిదారులకు చేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ చేసుకోవాలి. ప్రస్తుతం అన్నిటికీ కూడా ఆధార్ కార్డు అవసరమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏ పని చేయాలన్నా కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు అడుగుతున్నారు.
అలాగే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తో లింక్ అయ్యి ఉంటుంది. వివిధ ప్రభుత్వ పథకాలలో ఆధార్ కార్డుతో ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలను పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ చేయకపోతే వెంటనే ఇలా చేసుకోండి. ముందుగా మీరు యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.
ఆ తర్వాత ప్రొసీడ్ టు బుక్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ తో క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేసి ఓటిపి ను క్లిక్ చేయండి. మీ ఓటీపీకి వచ్చే మొబైల్ నెంబర్ ను నమోదు చేయండి. ఆ తర్వాత మీరు ఏ ఏ వివరాలు మార్చుకోవాలి అనుకుంటున్నారో వాటిని నమోదు చేయండి. అవసరమైన పూర్తి సమాచారాన్ని నమోదు చేయండి. ఈ విధంగా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన తేదీ మరియు సమయం ఆధారంగా ఆధార్ కేంద్రానికి వెళ్లి మీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోండి.