Health Tips: గుమ్మడి కాయ అంటే చాలా మందికి తెలిసేది ఒక్కటే. ఇంటికి దిష్టి తగల కుండా కట్టుకుంటారని. మరో దానికి పనిచేయదంటారు కొందరు.గుమ్మడి కాయ తో పాటు దాని గింజలు శరీరానికి ఎంత మేలు చేస్తాయో చాలా మందికి తెలియదు. గుమ్మడి గింజలు తింటే ఏమవుతుందనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
గుమ్మడి గింజలతో స్నాక్స్, మిఠాయిలు, వడియాలు తీసుకుంటారు. ఈ విదంగా తినడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. కొన్ని గిరిజన ప్రాంతాల్లో మేక, కోడి బలి ఇవ్వకుండా గుమ్మడి కాయను పగుల కొడుతారు. కానీ గుమ్మడి గింజలను మోతాదుకు మించి తినరాదు.
అధికంగా ఈ గింజలను తినడం వలన అజీర్తి ఏర్పడుతుంది. కడుపులో మంటగా ఉంటుంది. విరేచనాలు కూడా అవుతాయి. అధిక బరువు పెరగడానికి అవకాశం ఉంది. తలనొప్పి తోపాటు తలతిప్పడం, గొంతు నొప్పి ఏర్పడుతుంది. బీపీ ఉన్నవారు అతిగా తింటే బీపీ పెరిగే అవకాశం కూడా ఉంది.