Election Commission: ఓటర్ లిస్టు నుండి మాజీ ఎమ్మెల్యే పేరు తొలగింపు

Election Commission
Election Commission

Election Commission: వేములవాడ, జూలై 05 (ప్రజా శంఖారావం): భారత దేశ పౌరసత్వం కాకుండా ఆ మాజీ ఎమ్మెల్యేకు జర్మనీ దేశంలో పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారణ అయినందున ఆయన ఓటు హక్కును తొలగిస్తున్నట్లు హైకోర్టు (High Court) సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఓటర్ లిస్టు (Voter List) నుండి ఓటు హక్కును తొలగిస్తూ వారి స్వగృహానికి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు నోటీసులు అతికించారు. గత కొన్నీ రోజుల క్రితం పౌరసత్వ వివాదం కేసులో ఉన్నత న్యాయస్థానం భారతదేశ పౌరుడు కాదని, జర్మనీ పౌరుడు అని నిర్ధారిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం విధితమే.

2009 లో ప్రభుత్వ విప్, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, (MLA Aadi Srinivas) చెన్నమనేని రమేష్ బాబు భారతీయుడు కాదని అతను అక్రమ మార్గాల ద్వారా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాడని, దానిపై న్యాయస్థానాన్ని (Court) ఆశ్రయించగా, విచారణ (Investigation) చేపట్టి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు భారతీయ పౌరుడు (Indian Citizen) కాదని, జర్మనీ పౌరుడు (German Citizen) అని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. 2013 సంవత్సరంలో హైకోర్టు (High Court) ఆయన అక్రమంగా ఓటరు జాబితా (Voter List) లో పేరు నమోదు చేసుకున్నట్లుగా తీర్పును (Judgment) వెలువరించింది.

Also Read: ఫ్లాష్.. ఫ్లాష్.. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం… ఓటర్ ఐడికి ఆధార్, మొబైల్ లింక్ తప్పనిసరి

రాష్ట్ర హైకోర్టు చెన్నమనేని రమేశ్ (Ex MLA Ramesh Babu)ను జర్మనీ పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారించినందున ఎన్నికల ఓటర్ జాబితా నుండి ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తామని, ఏమైనా అభ్యంతరాలు (Objections) ఉంటే జూలై 02వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలని రెవెన్యూ అధికారులు వేములవాడ (Vemulawada) లోని ఆయన నివాసానికి గతంలోనే నోటీస్ అంటించారు. కానీ నేటికీ ఎలాంటి అభ్యంతరాలు తెలుపకపోగా శనివారం ఆయన పేరును ఓటర్ జాబితా నుండి పేరు ను తొలగిస్తూ మాజీ ఎమ్మల్యే నివాసానికి నోటీసులు (Notice) అధికారులు అంటించడం పై ఇప్పుడు చర్చానీయంశమైంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now