Election Commission: ఈసి కొరడా.. తెలుగు రాష్ట్రాల్లోని.. ఆ రాజకీయ పార్టీల్లో వణుకు..
కేంద్ర ఎన్నికల సంఘం అంటేనే రాజకీయ నాయకులకు వెన్నులో చలి పుడుతుంది. అందులో పనిచేసే అధికారుల అధికారాలే అంత కఠినంగా ఉంటాయి. మరీ ముక్యంగా ఎన్నికల్లో పోటీచేస్తున్న వారైతే వణికి పోవాల్సిందే. ఎన్నికల సంఘం నిబంధనలు అంత కఠినంగా ఉంటాయి. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా టిఎన్ శేషన్ భాద్యతలు చేపట్టినప్పుడే కమిషన్ అంటే ఇలా ఉంటది అని రాజకీయ నాయకులకు రుచి చూపించారు.
దేశ వ్యాప్తంగ ఎన్నికల కమిషన్ తాజాగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్దమైనది. దేశంలో 345 పార్టీలను డి లిస్ట్ లో నమోదు చేయడానికి సిద్దమైనది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీగా అవతరించి ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను గుర్తిస్తోంది. అటువంటి పార్టీలపై చర్యలు చేపట్టడానికి సిద్దమైనది.
ఏదయినా ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం ఆరు శతం ఓట్లు సాధించాలి. ఎన్నికల్లో అసలే పోటీచేయని పార్టీలతో పాటు ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు కూడా సాధించని పార్టీలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతోంది. ఇటువంటి పార్టీలు దేశవ్యాప్తంగా 345 పార్టీలు ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది.