Formers: రుణమాఫీ కాలేదని బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన

Formers
Formers

Formers: మెట్ పల్లి, ఆగస్టు 17 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట కెనరా బ్యాంక్ ఎదుట రైతులు రుణమాఫీ రాలేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట, మల్లాపూర్ మండలం ధర్మారం, సాతరం, చిట్టపూర్, చింతలపేటతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులకు రుణమాపి కాలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. మొదటి విడత రుణమాఫి నుంచి ఇప్పటివరకు తమకు ఒక్క రూపాయి కూడా రుణమాఫి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులను వివరణ కోరగా టెక్నీకల్ సమస్యతో ఇబ్బంది వచ్చిందని తెలిపారు. అధికారులు తొందరగా స్పందించి రుణమాఫి చేయించాలని రైతులు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now