TS 10th Result Date and Time 2025: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవ తరగతి పరీక్షల ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఎట్టకేలకు విద్యాశాఖ ఫలితాల ముహూర్తం ఖరారు చేసింది.
తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేయనున్నట్లు తాజాగా విద్యాశాఖ ప్రకటించింది. బుధవారం రోజు హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యాశాఖ ఏప్రిల్ 29న అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ తమ ఫలితాలను
https://bse.telangana.gov.in/ ఈ వెబ్ సైట్ (https://www.manabadi.co.in/) తో అధికారిక తెలుసుకోవచ్చు. ఈసారి గతంలో మాదిరిగానే విద్యార్థులకు గ్రేడ్ తోపాటు మార్కులను కూడా జతచేసి మార్కుల జాబిత ను ప్రకటించనున్నారు.
అలాగే మార్కులతో పాటు సబ్జెక్ట్స్ వైస్ గా గ్రేడ్ కూడా తెలుపనున్నారు. విద్యార్థుల మార్కులకు సంబంధించి మార్క్స్ మెమోలు కూడా జారీ చేస్తారు. ఈ మెమో లలో సబ్జెక్టుల వారిగా మార్కులతోపాటు గ్రేడ్లు కూడా ఉంటాయి. ఈసారి తెలంగాణ ప్రభుత్వం జిపిఏ విధానాన్ని తొలగించి కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారిగా పరీక్షల్లో వచ్చిన మార్కులతో పాటు ఇంటర్నల్ పరీక్షల మార్కులు అలాగే మొత్తం మార్కులు వాటితో పాటు సబ్జెక్టు వారీగా గ్రేడ్లు కూడా పొందుపరచనున్నారు. అలాగే ఈ మెమోలపై పాస్ లేదా ఫెయిల్ అని కూడా తెలుపుతారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. ఒకవేళ మార్పులకు తక్కువ వచ్చిన విద్యార్థులకు కూడా పేపర్ రివల్యూషన్ అవకాశాన్ని కూడా ప్రభుత్వం ప్రకటి కల్పిస్తున్నట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏదైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రభుత్వం విద్యార్థుల కోసం కల్పిస్తుంది. అలాగే ఏదైనా సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వెంటనే సప్లమెంటరీ ఎగ్జామ్ ని కూడా నిర్వహించడానికి విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా ఉండే విధంగా చూడాలని చెబుతూ, విద్యార్థులు కూడా ఎక్కడ అధైర్య పడకూడదని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.