Future Prediction with Ants: మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో చీమల గురించి కూడా ప్రస్తావించబడింది. ఇంట్లో నల్ల చీమలు ఉండడం చాలా శుభప్రదంగా అలాగే ఎరుపు రంగు చీమలు అశుభంగా భావిస్తారు. నిపుణుల ప్రకారం నల్ల చీమలు ఆర్థిక లాభాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. అలాగే ఎర్ర చీమలు ప్రమాదానికి సంకేతంగా చెబుతారు. చీమలకు మన దేశ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పొచ్చు. అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో నల్ల రంగు చీమలు కానీ ఎరుపు రంగు చీమలు కానీ కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించడం సాధారణం.
కానీ జ్యోతిష్య శాస్త్రం లేదా సంప్రదాయ నమ్మకాల ప్రకారం ఇంట్లో ఈ చీమలు సుభ లేదా ఆ శుభసంకేతాలను సూచిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా ఇంట్లో కనిపించే ఎరుపు లేదా నలుపు రంగు చీమల గురించి చాలా నమ్మకాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఆర్థిక లాభం కలుగుతుంది లేదా ఆపద కలుగుతుంది అని చాలామంది నమ్ముతారు. భారతీయ సంస్కృతిలో ఇంట్లో నల్ల చీమలు కనిపించడం చాలా శుభప్రదంగా చెప్తారు. ఆహారం లేకుండా ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే అవి లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా భావిస్తారు.
అంటే త్వరలో ఇంట్లో ఆర్థిక లాభం లేదా శుభవార్తలు వినే అవకాశం ఉందని సంకేతం. నల్ల చీమలకు పిండిలో కొంచెం చక్కెర కలిపి ఆహారంగా పెట్టడం వలన కూడా చాలా పుణ్యకార్యంగా నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో స్థిరత్వం మరియు సంపదను ఇది తెస్తుందని చాలామంది నమ్మకం. అలాగే భారతీయ సంస్కృతిలో ఇంట్లో ఎరుపు రంగు చీమలను అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇంట్లో ఎక్కువ మొత్తంలో ఎరుపు రంగు చీమలు కనిపిస్తే త్వరలో ఆ ఇంట్లో ఆపద లేదా అశుభ సంఘటన జరిగే అవకాశం ఉందని చెప్తారు. ఎరుపు రంగు చీమలు ఎక్కువ సంఖ్యలో ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు లేదా ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక నష్టం కలుగుతుందని చెప్తారు.