Todays Gold Rate: గత కొన్ని నెలల క్రితం పసిడి ధరలు ఆల్ టైం హై రికార్డుకు చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక పరిణామాలు కూడా బంగారం పెరుగుదలకు కారణం అయ్యాయి. జూన్ నెల చివరి వారంలో వరుసగా బంగారం ధరలో తగ్గుదల కనిపించడంతో బంగారం ప్రియులతో కాస్త ఊరట కలిగింది. బంగారం ధరలు బాగానే తగ్గుతున్నాయి అని అనుకుంటున్నా సమయంలో మళ్ళీ ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సంకాలపై ఆందోళన కారణంగా బంగారం అమ్మకాలు భారీగా పెరిగాయి.
డిమాండ్ పెరగడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈనెల తొలి మూడు రోజులలో బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. ఈ గడిచిన మూడు రోజులలో స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.2080 పెరిగింది అలాగే ఆర్నమెంట్ పసిడి ధరపై రూ.1910 పెరిగింది. ఢిల్లీ నగరంలో ఈరోజు ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.91,210, స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,490, కిలో వెండి ధర రూ.1,11,100 గా ఉన్నాయి.
Also Read: ఈ నెల కూడా ఇక అంతే…రేషన్ కార్డు లబ్ధిదారులకు భారీ షాక్.. ఇచ్చిన ప్రభుత్వం
ఇక దేశంలో పలు ముఖ్య నగరాలు ముంబై, కోల్కత్తా, చెన్నై, కేరళ, పూణేలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,340, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.91,060, కిలో వెండి ధర రూ.1,21,100 గా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో పలు ముఖ్య పట్టణాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రిలో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.99,340, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.91,060, కిలో వెండి ధర రు.1,21,100 గా నమోదయ్యాయి.