Todays Gold Rate: చాలా రోజుల నుంచి బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. ప్రస్తుతం ఈరోజు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రభావం మన దేశంలో కూడా కనిపిస్తుంది. మన దేశ సంస్కృతి సంప్రదాయంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడింది.
ప్రతి ఒక్కరు కూడా పెళ్లిళ్లు, పండుగల సీజన్లో తమ స్తోమతకు తగినట్లుగా బంగారాన్ని కొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా ఇష్టపడతారు. మనదేశంలో బంగారానికి అంతగా డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఏడాది ప్రారంభంలో పసిడి ధరలు ఆల్టైమ్ హైరికార్డుగా చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. అయితే గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి.
మన దేశంలో తెలుగు రాష్ట్రాలలో పలు ప్రధాన నగరాలు అయినా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.98,950, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.90,700 గా ఉన్నాయి. ఇక దేశంలో కొన్ని ప్రధాన నగరాలు ముంబై, కోల్కత్తా, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలలో ఈరోజు స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.98,950, ఆర్నమెంట్ తులం బంగారం ధర రూ.90,700 గా ఉంది. బంగారంతోపాటు ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. వెండి ధరపై మూడు రోజుల నుంచి వెయ్యి రూపాయలు తగ్గి ఈరోజు కిలో వెండి ధర మన దేశ మార్కెట్లో రూ.1,18,000 గా ఉంది.