Todays Gold Rate: బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం తో పాటు వెండి ధర కూడా స్థిరంగానే ఉన్నట్లు సమాచారం. బంగారం కొనుగోలు చేయడానికి ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు బాగా తగ్గుతున్నాయి. అయితే ఈరోజు మాత్రం ఈ ధరలు స్థిరంగా ఉన్నాయ ని తెలుస్తుంది. హైదరాబాదు నగరంలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశ మార్కెట్లో ఆర్నమెంట్ తులం బంగారం ధర ఈరోజు రూ.89,300.
గత ఐదు రోజుల నుంచి తులం బంగారం ధర పై రూ.550, రు.850, రూ.250, రూ.1350, రూ.50 చొప్పున తగ్గుతూ వచ్చాయి. ఈరోజు మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అలాగే ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.97,420 గా ఉంది. ఇక మన దేశ మార్కెట్లో కిలో వెండి ధర ఈరోజు రూ.1,17,800 ఉంది. గత పది రోజుల్లో నుంచి వెండి ధర లో పెరుగుదల కనిపించలేదు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. ఈరోజు స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 3270 డాలర్ల దగ్గర ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం ఇది 3500 డాలర్ల వరకు ఉండేది.
మన దేశ వాసులకు బంగారం అంటే చాలా ఇష్టం. అయితే చాలామంది బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక అవసరాలలో తమకు ఆదుకునే ఒక భరోసాగా కూడా భావిస్తారు. కాబట్టి చాలామంది బంగారం ధరలను గమనించి బంగారం తక్కువ ధరలు ఉన్న సమయంలో కొనుగోలు చేసి పెట్టుకుంటారు. ఇక మన దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాలు చెన్నై, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, విజయవాడ మరియు విశాఖపట్నం నగరాలలో కూడా ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.97,420, గవర్నమెంట్ ధర రు.89,300 గా ఉంది.