Todays Gold Rate: గత కొన్నాళ్లుగా బంగారం ధరలు మార్కెట్లో నేలవైపు చూడకుండా ఆకాశం వైపు ధరలు పరుగులు తీస్తున్నాయి. వెనక్కి చూడకుండా జెట్ స్పీడ్ తో పసిడి ధరలు పెరిగిపోతుండడం పై బంగారం ప్రియులు పెదవి విరుస్తున్నారు. తాజాగా సంక్రాంతికి ముందు భోగి రోజు బంగారం ధరలు దేశీయ మార్కెట్లో బగ్గుమంటున్నాయి. రోజు రోజుకి బంగారం ధరలు షాకింగ్ ఇస్తూ.. బంగారం ప్రియులకు అందనంత ఎత్తులోకి ధరలు ఎగబాకుతుంటే ఎప్పుడెప్పుడు ఆకాశం నుండి నేల పైకి ధరలు దిగివస్తాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు పసిడి ప్రియులు.. జనవరి 14 2026 న పసిడి ధరలు ఇలా..
Read Also: ఈరోజు బంగారం ధరలు ఎంతో తెలుసా..
ప్రధాన నగరాలలో బంగారం ధరలు 10 గ్రాములకు..
నగరం. 24 క్యారెట్లు 22 క్యారెట్లు 18 క్యారెట్లు
హైదరాబాద్ రూ.1,44,000/- రూ.1,32,000/- రూ.1,08,000/-
అహ్మదాబాద్ రూ.1,44,050/- రూ.1,32,050/- రూ.1,08,050/-
చెన్నై రూ.1,44,880/- రూ.1,32,800/- రూ.1,10,800/-
ఢిల్లీ రూ.1,44,150/- రూ.1,32,150/- రూ.1,08,150/-
ముంబై రూ.1,44,000/- రూ.1,32,000/- రూ.1,08,000/-
విజయవాడ రూ.1,44,000/- రూ.1,32,000/- రూ.1,08,000/-
విశాఖపట్నం రూ.1,44,000/- రూ.1,32,000/- రూ.1,08,000/-
రోజురోజుకి బంగారం ధరల్లో తగ్గుముఖం లేకపోవడంతో బంగారం ధరలను చూసి ఈ జన్మలో మళ్ళీ బంగారం కొనగలమా అని పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.
















