Todays Gold Rate: బంగారం ప్రియులకు ఒక అదిరిపోయే మంచి న్యూస్. ఈరోజు కూడా అంతర్జాతీయ మార్కెట్తోపాటు మన దేశం మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. గత పది రోజుల నుంచి బంగారం ధరలలో వరుసగా తగ్గుదల కనిపిస్తుంది. బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం అని తెలుస్తుంది. స్వచ్ఛమైన తులం బంగారం ప్రస్తుతం లక్ష మార్క్ కిందకి దిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ ధరలు భారీగా దిగి వస్తున్నాయి. గత వారం రోజుల నుంచి పసిడి ధరలలో మనకు వరుసగా తగ్గుదల కనిపిస్తుంది.
దీనికి ముఖ్య కారణం అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం అలాగే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధానికి బ్రేక్ పడడం అని చెప్పొచ్చు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం తగ్గడంతో ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ ప్రీమియం తగ్గిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలో తగ్గడానికి కారణం అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన నగరాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మరియు వరంగల్ లలో ఈరోజు స్వచ్ఛమైన తులం పసిడి ధరపై రూ.160 రూపాయలు తగ్గి రూ.97,260 గా ఉంది.
అలాగే 22 క్యారెట్ల తులం బంగారం పై ఈరోజు రూ.150 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.89,150 గా ఉంది. దేశంలో పలు ముఖ్య నగరాలు బెంగళూరు, కోల్కతా, ముంబై నగరాల ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.97,260, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.89,150 గా ఉంది. ఇక మన దేశంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలలో కూడా ఈరోజు కిలో వెండి ధరపై రూ.100 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,07,700 గా కొనసాగుతుంది.