Rythu: రైతులకు శుభవార్త.. అతి తక్కువ వడ్డీకి 3 లక్షల లోన్.. ఈ స్కీమ్ చాలామందికి తెలిసి ఉండదు

Rythu
Rythu

Rythu: మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముకగా ఉంది. కానీ మన దేశంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పేద మరియు మధ్యతరగతి రైతులకు పంట సాగు చేయడానికి పెట్టుబడి ఖచ్చులు కూడా వారికి ఆర్థిక భారంగా మారుతున్నాయి. అకాల వర్షాలు మరియు ప్రకృతి వైపరీత్యాల కారణంగా కూడా మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. దీంతో అన్నదాతలు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రాయితీ పథకాలను అమలు చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పథకం ద్వారా రైతులకు చాలా తక్కువ వడ్డీకే 3 లక్షల రూపాయలు లోన్ అందిస్తుంది.

పేద రైతులకు పొలంలో సాగు చేసుకునేందుకు లక్ష రూపాయల అప్పు దొరకడం చాలా కష్టం. ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకం కింద రైతుకు మూడు లక్షల రూపాయల రుణం అందిస్తుంది. ఈ పథకాన్ని సవరించిన వడ్డీ రాయితీ పథకంగా చెప్తారు. కేంద్ర మంత్రివర్గం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికోసం అవసరమైన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకంలో ఎలాంటి మార్పులు కూడా ప్రభుత్వం చేయలేదు.

గతంలో మాదిరిగానే ఈ పథకం ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. వడ్డీ రాయితీ పథకం కింద రైతులకు బ్యాంకులో అందిస్తున్నారు విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో రైతులందరూ కూడా బ్యాంకులు విధించే వడ్డీ కంటే కూడా తక్కువ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద మూడు లక్షల రూపాయలకు వరకు రైతులకు రుణం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. రైతులకు ఈ పథకం కింద ఏడు శాతం వార్షిక వడ్డీకి రుణం అందిస్తారు. సకాలంలో తీసుకున్న లోన్ చెల్లించినట్లయితే వారికి అదనపు ప్రయోజనాలు మరింత రాయితీ వంటివి కూడా ఉంటాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now