Inter Results 2025 Date: తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం జరిగింది. మార్చి 30 నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ వేసవి సెలవు జూన్ 1 వరకు కొనసాగుతాయి. ప్రభుత్వ మరియు ప్రైవేటు, ఏడెడ్ కాలేజీలన్నీ ఈ వేసవి సెలవులను తప్పకుండా పాటించాలని ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. అలాగే వేసవి సెలవుల్లో గుడ్ ఏదైనా కాలేజీలో అనధికారికంగా క్లాసులను నిర్వహిస్తున్నట్లు తెలిసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే ఏదైనా కాలేజీ వాళ్ళు అనధికారంగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించింది. ఈ వేసవి సెలవులను విద్యార్థులు తమ స్వీయ అధ్యయనం మరియు స్కిల్ డెవలప్మెంట్ కొరకు వినియోగించుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సంస్థ సూచనలు జారీ చేసింది.
2025-26 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి తిరిగి జూన్ రెండు నుంచి ఇంటర్ కాలేజీలు తెరుచుకోనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే మరోవైపు ఇంకా పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈనెల ఏప్రిల్ చివరి నాటికి ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు పూర్తి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే అధికారులు పరీక్షా ఫలితాల్లో పారదర్శకత పాటించే విధంగా చాలా పగడ్బందీ ఏర్పాట్లతో సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతా బాగా జరిగితే ఈ నెల చివరినాటికి ఫలితాలు వెలువడుతాయి.