UAS Vissa: అమెరికాకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హెచ్1బి వీసా తో పనిలేదు.. ఇలా కూడా వెళ్లొచ్చు

UAS Vissa
UAS Vissa

UAS Vissa: ఒక ప్రత్యేక నాన్ ఇమిగ్రెంట్ వీసానో ఓ 1 వీసా అని అంటారు. ఇది అమెరికాలో తాత్కాలికంగా కొంతకాలం నివసించి అక్కడే పని చేయాలి అని భావించే అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తుల కోసం రూపొందించబడింది. UAS వెళ్లాలని అనుకుంటే ఇలా ఈజీగా వెళ్ళవచ్చు. దీనికి హెచ్1 బి వీసా తో సంబంధం ఉండదు. అయితే హెచ్ 1 బి మీద పొందలేని వాళ్లు కూడా ఓ 1 వీసా ద్వారా అమెరికాకు వెళ్లొచ్చు. ఈ వీసా కోసం అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడున్న రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నారని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

మీరు ప్రస్తుతం ఉన్న రంగంలో కీలక పాత్ర పోషించిన ఆధారాలు లేదా జాతీయ లేదా అంతర్జాతీయ అవార్డులు పొందినట్లు, మీ గురించి ప్రముఖ ప్రచురణలు, సాధారణం కంటే మీరు ఎక్కువ జీతం వంటివి రుజువుగా ఈ వీసా కోసం సమర్పించాల్సి ఉంటుంది.ఈ వీసాను ముఖ్యంగా రెండు భాగాలుగా విభజిస్తారు. వివిధ రంగాలు సైన్స్, వ్యాపారం, విద్యా లేదా అథ్లెటిక్స్ వంటి వాటిలో అసాధారణ సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తులకు అంటే వారి వారి సంబంధిత రంగంలో వాళ్ళు జాతీయ లేదా అంతర్జాతీయ అవార్డులు పొంది ఉండాలి. కళాకారులకు, సంగీతకారులు లేదా రచయితలు సినిమా ఇండస్ట్రీలో అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకు ఇది దొరుకుతుంది.

Also Read: ఇకపై అమెరికాలో మన వాళ్లకు ఉపశమనం.. అమెరికా వెళ్లాలనుకునేవారికి మంచి రోజులు

అసాధారణ ప్రతిభా కలిగి ఉండి అమెరికా వెళ్లాలని భావిస్తున్న వారికి ఈ వీసా అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. అటువంటి వారికి ఎటువంటి లాటరీ లేకుండా అలాగే వార్షిక పరిమితి లేకుండా ఈ వీసా దొరుకుతుంది.మీరు ఈ వీసా కోసం ఏడాదిలో ఎప్పుడైనా సరే దరఖాస్తు చేసుకోవొచ్చు. అలాగే దీనికి అనుమతి కూడా చాలా త్వరగా లభిస్తుంది. ఈ వీసాను మొదట్లో మూడు సంవత్సరాలకు గరిష్టంగా మంజూరు చేస్తారు. ఆ తర్వాత మీరు మీకు ఉన్న అవసరాన్ని బట్టి ఒక ఏడాది ఈ వీసాను పొడిగించుకోవచ్చు. ఈ వీసా తాత్కాలిక వీసా అయినప్పటికీ కూడా మీరు అమెరికాలో దీర్ఘకాలికంగా ఉండి మీ పని పూర్తి చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now