Today Gold Rate: మనదేశంలో బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెరిగితే మనదేశంలో కూడా వీటి ధరలో పెరుగుదల ఉంటుంది. అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ మారడం వలన కూడా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కూడా వీటి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయి. మార్కెట్లో గోల్డ్ మరియు సిల్వర్ ధరలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కొన్ని రోజులు వీటి ధరలు తగ్గితే మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి.
కానీ మన దేశ సంప్రదాయం బంగారంతో ముడిపడి ఉండడంతో మన దేశ మార్కెట్లో బంగారానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఒకే విధంగా ఉంటుంది. ఇక సోమవారం రోజు బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మన దేశవ్యాప్తంగా పలు ముఖ్య నగరాలు ముంబై, చెన్నై, కోల్కత్తా మరియు బెంగళూరులో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,820, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రు.90,590 గా ఉన్నాయి.
Aslo Read: భలే ఛాన్స్.. బంగారం ప్రియులకు.. ఈరోజు ధరలు ఇవే
ఇక ఢిల్లీ నగరంలో మాత్రం సోమవారం రోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,970, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,740 గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలి ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు వరంగల్ లో ఈరోజు స్వచ్ఛమైన తులం గోల్డ్ ధర రూ.98,820, ఆర్నమెంట్ తులం గోల్డ్ ధర రూ.90,590 గా ఉంది. ఈరోజు దాదాపు అన్ని నగరాలలో కిలో వెండి ధర రూ.1,09,900 గా ఉంది.