PMEGP Loan: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం.. రూ.9 లక్షల సబ్సిడీతో.. రూ.25 లక్షల లోన్

PMEGP Loan
PMEGP Loan

PMEGP Loan: మన దేశంలో చాలామంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువతకు అనేక పథకాలపై సబ్సిడీ అందిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలు, బిసి, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వారికి దాదాపుగా 35 శాతం వరకు రుణాలపై సబ్సిడీని కల్పిస్తుంది. ఈ లోన్ పొందాలంటే మీరు ముందుగా మీ బ్యాంకు నుంచి లోన్ దరఖాస్తు అప్రూవ్ అవ్వాలి.

దీనికోసం మీరు ముందుగా మీ బ్యాంకులో లోన్ కోసం అప్లై చేసి ఆ లోన్ అప్రూవ్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ తో మీరు పిఎంఈజీపి అనే అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. దీనిలో మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వివరాలుతోపాటు మీ వ్యక్తిగత వివరాలు కూడా తెలియజేయాలి. అందులో ఒక ఏజెన్సీ ని మీరు ఎంపిక చేసుకోవాలి. మూడు రకాల ఏజెన్సీ ద్వారా సబ్సిడీ పొందవచ్చు. మొదటిది ఖాదీ బోర్డు కింద, రెండవది కాది కమిషన్ అలాగే మూడోది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్. ఈ మూడు ఆప్షన్స్ లో మీరు ఏదో ఒకటి క్లిక్ చేయాలి. మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేశారు ఆ ఏజెన్సీ వాళ్ళు మీకు వెరిఫై చేయడానికి రావడం జరుగుతుంది.

దీనికోసం వాళ్లు మీరు నిజంగానే ఈ యూనిట్ ఏర్పాటు చేశారా, దీనికి సంబంధించి వ్యాపారం చేస్తున్నారా వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత మీకు సబ్సిడీ రిలీజ్ అవుతుంది. అయితే మీరు ప్రభుత్వరంగ బ్యాంకులలో మాత్రమే ఈ సబ్సిడీని పొందగలుగుతారు. ప్రైవేట్ బ్యాంకులలో సబ్సిడీ లభించదు. ఒకవేళ మీరు ఏదైనా ప్రభుత్వారంగా బ్యాంకులో రూ.25 లక్షల కోసం లోన్ అప్రూవ్ చేసి ఆ తర్వాత రూ.25 లక్షల ప్రాజెక్టు రిపోర్ట్ మీరు సబ్మిట్ చేసినట్లయితే అందులో మీకు ప్రభుత్వం నుంచి రూ.8,72,000 సబ్సిడీ లభిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now