Gas cylinder: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. మహాలక్ష్మి పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులకు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత మహిళల బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తున్నారు.
కానీ గత మూడు నెలల నుంచి వీటి రాయితీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం లేదు అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందుతున్న మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ
915 గా ఉంది. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలు గ్యాస్ సిలిండర్ రూ.915 తర్వాత రాయితీ డబ్బులు మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి.
సిలిండర్ తీసుకున్న కేవలం రెండు మూడు రోజుల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో 500 రూపాయలు మినహాయించి మిగిలిన డబ్బులు సబ్సిడీ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. అయితే మహాలక్ష్మి పథకం కింద 375 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 415 రూపాయలు సబ్సిడీ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. వినియోగదారులు గత మూడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడానికి కారణం ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన 150 నుంచి 180 కోట్ల రూపాయలు నిధులు అని తెలుస్తుంది.