Vastu Tips for Main door: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులను వేలాడదీస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది

Vastu Tips for Main door
Vastu Tips for Main door

Vastu Tips for Main door: ఇంట్లో ప్రతి కుల శక్తి కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ఆర్థిక సమస్యలు వంటివి ఏర్పడుతూ ఉంటాయి. ప్రతికూల శక్తి ఉన్న ఇంట్లో ఆనందం, శాంతి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి కారణంగా ఇంట్లో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని రకాల వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టడం వలన ఆ ఇంట్లో ఉన్న ప్రతికూలశక్తి బయటకు వెళ్లిపోయి ఆ ఇంట్లో సానుకూల శక్తి కలుగుతుంది అని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి మన దేశ సంప్రదాయంలో మరియు పురాణ గ్రంథాలలో చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

ఇంటి ప్రధాన ద్వారం ద్వారా ఇంట్లోకి వచ్చే శక్తి ప్రవేశంగా మాత్రమే కాకుండా ఇంట్లో శుభ మరియు ఆ శుభ శక్తుల ప్రభావం కూడా ఇంటి ప్రధాన ద్వారం నుంచే ప్రారంభం అవుతుంది. అయితే కొన్ని రకాల వస్తువులను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతికూలశక్తి ప్రవేశించదు. అయితే ఈ వస్తువులను ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీయాలి. హిందూ సంప్రదాయంలో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణం కట్టడానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మామిడి ఆకులు, అశోక ఆకులు లేదా బంతిపూలతో తయారుచేసిన తోరణాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి పట్టడం చాలా పవిత్రమైనదిగా చెప్తారు.

Also Read: ఇంట్లో ఎరుపు, నలుపు చీమలు దేనికి సంకేతమో తెలుసా..!

ఇవి ఇంట్లోకి ప్రతి కుల శక్తి రాకుండా చేస్తాయి. సానుకూల శక్తిని ఇవి ఆకర్షిస్తాయి. ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. నల్ల గుర్రపు నాడ ను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చాలా పవిత్రంగా భావిస్తారు. దీనిని ప్రధాన ద్వారం దగ్గర ఈ ఆకారంలో వేలాడదీయడం వలన ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు. ఇది సంపదను ఆకర్షిస్తుంది అని నమ్ముతారు. స్వస్తిక చిహ్నాన్ని కూడా హిందూ మత శాస్త్రంలో చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. విండ్ చైన్ లోహం లేదా వెదురుతో తయారుచేసిన విండ్ చిమ్ కూడా ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. అలాగే గణేష్ విగ్రహాన్ని లేదా లక్ష్మీదేవి యంత్రాన్ని కూడా ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం చాలా శుభప్రదంగా చెబుతారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now