Ram Charan: హీరో రామ్ చరణ్ చేతికి కట్టు.. అసలు కారణం ఇదే.. వైరల్ వీడియో

Ram Charan
Ram Charan

Ram Charan: ప్రస్తుతం గ్లోబల్ స్టార్ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివన్న కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. గురువారం జూన్ 26వ తేదీన హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో శిల్పకళావేదికలో జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కలుగును రాజకీయ ప్రముఖులు అలాగే సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చివరిలో అందరూ కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆ సమయంలో హీరో రామ్ చరణ్ స్టేజ్ మీద కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ చేతికి కట్టు కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ చేతికి కట్టు ఉండడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హీరో రామ్ చరణ్ చేతికి ఏమైంది, ఆయన చేతికి అంత పెద్ద బ్యాండేజ్ ఎందుకు ఉంది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కు గాయమైనట్లు చెప్తున్నారు. అయితే ఆయన చేతికి గాయం పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ గాయం పెద్దది కూడా కాదని తెలుస్తుంది. రామ్ చరణ్ రీసెంట్ గా శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ చేంజర్ సినిమా నిరాశపరచడంతో ప్రస్తుతం ఆయన పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now