Indian Railways: ఐ ఆర్ సి టి సి ఎక్కువ మంది కలిసి ప్రయాణం చేసేందుకు సౌకర్యవంతంగా ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్ లో అందిస్తున్నారు. మీరు రైలు మొత్తాన్ని లేదా ఒక కోచ్ ను బుక్ చేసుకునే అవకాశం రైల్వే కల్పిస్తుంది. రోజుకు ఎన్నో లక్షల మంది రైలు ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కుటుంబం మొత్తం లేదా ఫ్రెండ్స్ అందరూ కలిసి రైలులో ప్రయాణం చేయడానికి టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ వాళ్ళందరికీ కూడా ఒకే కోచ్ లో పక్క పక్కన ఉండే బెర్త్ల్ దొరకడం అనేది చాలా కష్టం. కుటుంబం మొత్తం కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒకచోట బెర్త్ దొరికితే వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు అని టెన్షన్ ఉంటుంది. అయితే ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా మీరు ఒక మొత్తం కోచ్ ను బుక్ చేసుకునే అవకాశం ఐఆర్సిటిసి కల్పిస్తుంది.
ఎక్కువమంది కలిసి ఒకేసారి రైలులో ప్రయాణం చేయడానికి ఫుల్ టారిఫ్ రేట్ సర్వీస్ను ఐఆర్సిటిసి అందిస్తుంది. దీని ద్వారా మీరు ఒక కోచ్ మొత్తాన్ని లేదా ఒక రైలు మొత్తాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది మీ కుటుంబం మొత్తం ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా మరియు సులభతరంగా మారుస్తుంది. సాధారణంగా మీరు రైలులో గ్రూప్ టికెట్స్ పొందాలంటే చాలా ఇబ్బందులు పడాలి. కానీ ఎఫ్.టి.ఆర్ సర్వీస్ తో మీకు ఇటువంటి ఇబ్బందులు ఉండవు అని తెలుస్తుంది. మూడు రకాల చాటర్ సర్వీస్ లను ఐఆర్సిటిసి మీకు అందిస్తుంది. మీరు ప్రయాణం చేయడానికి ఇవి చాలా అనువుగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. మీరు ఐఆర్సిటిసి అందిస్తున్న ఈ సర్వీస్ లో రైలులో ఉన్న ఒక కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకోవచ్చు.
ఇందులో మీకు 18 నుంచి 100 సీట్లు దొరుకుతాయి. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఇవి మీకు బాగా సరిపోతాయి. అలాగే ఎక్కువ మంది కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటే మీరు రైలు మొత్తాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 18 నుంచి 24 కోచుల వరకు ఉంటాయి. పెళ్లిళ్లకు లేదా విహారయాత్రలకు పెద్ద మొత్తంలో కలిసి ప్రయాణం చేసేందుకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఎఫ్ టి ఆర్ ద్వారా మీరు బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆరు నెలల ముందే చేసుకోవాలి. అలాగే మీరు రైలులో ఉన్న ప్రతి కోచ్కు రిజిస్ట్రేషన్ మనీ కం సెక్యూరిటీ డిపాజిట్ రూ.50 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రైలు మొత్తాన్ని బుక్ చేసుకున్నట్లయితే రూ.12 లక్షల రూపాయలు ముందుగానే డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని వాళ్లు మీ ప్రయాణం పూర్తయిన తర్వాత తిరిగి చెల్లిస్తారు.