Property Right’s: ప్రతి తండ్రి కూడా తన పిల్లల కోసం ఎంతో కొంత ఆస్తిని కూడ పెడతాడు. అయితే తాను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తన పిల్లలందరికీ సమానంగా లేదా తనకు బాగా ఇష్టమైన వారికి ఆస్తి చెందాలని మరణానికి ముందు తండ్రి వీలునామా రాసుకుంటాడు. ఆ వీలునామాలు ఏ ఏ పిల్లలకు ఎంత ఆస్తి ఉంటుందో మొత్తం వివరాలు రాసి ఉంటాయి. ఈ విధంగా మరణానికి ముందు వీలునామా రాయడం వలన తండ్రి మరణించిన తర్వాత పిల్లలు ఆస్తి కోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో చాలామంది వీలునామా రాయకుండానే అనుకోకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. ఈ విధంగా ఒక వ్యక్తి వీలునామా రాయించకుండా మరణించినట్లయితే అతని ఆస్తి వారసత్వంగా ఎవరికి దక్కుతుంది. ఒకవేళ అతనికి వివాహిత కుమార్తె ఉంటే ఆమెకు ఆస్తి వస్తుందా లేదా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తి ఆస్తిని హిందూమత చట్టంలో రెండు వర్గాలుగా విభజించడం జరిగింది. పూర్వీకుల నుండి ఒక వ్యక్తి వారసత్వంగా పొందిన ఆస్తిని పూర్వీకుల ఆస్తి అంటారు. పిల్లలు అలాగే కొడుకు లేదా కూతురు ఎవరికైనా సరే ఆస్తి పై జన్మ హక్కు ఉంటుంది. పూర్వీకుల ఆస్తి పై కుమార్తెకు జన్మించిన వెంటనే హక్కు లభిస్తుంది. ఒక వ్యక్తి స్వయంగా సంపాదించిన ఆస్తి ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా స్వయంగా సంపాదించిన భూమి లేదా ఇల్లు వంటి ఆస్తులు ఉంటే వాటిని తమ ఇష్టమైన పిల్లలకు ఇవ్వచ్చు. కూతురికి తన ఆస్తిలో వాటా ఇవ్వడానికి తండ్రి నిరాకరిస్తే ఆమెకు ఆస్తి రాదు.
ఒకవేళ తండ్రి ఎటువంటి వీలునామా రాయకుండా మరణించినట్లయితే హిందూ వారసత్వ చట్టం 2025 ప్రకారం అతని చట్టబద్ధమైన వారసులందరికీ కూడా తండ్రి ఆస్తిపై సమానమైన హక్కులు లభిస్తాయి. అలాగే పురుష వారసులలో కూడా నాలుగు వర్గాలుగా విభజించారు. తండ్రి ఆస్తి పై మొదటి వర్గం వారసులకు తొలి హక్కు ఇవ్వబడుతుంది. వీళ్ళలో కూతుర్లు కూడా ఉన్నారు. ఈ విధంగా కూతురికి కూడా తండ్రి ఆస్తిపై పూర్తి హక్కులు లభిస్తాయి.