Acharya Chanakya Niti: వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో ప్రస్తావించడం జరిగింది. దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ఈ నాలుగు విషయాలను తప్పకుండా పాటించాలి అని ఆచార్య చానికుడు సూచిస్తున్నారు. మనిషి జీవితానికి సంబంధించిన ప్రతి విషయం గురించి కూడా ఆచార్య చానికుడు నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. అందులో ఆయన వైవాహిక జీవితం గురించి కూడా అనేక నియమాలను సూచించాడు. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండడం ముఖ్యం. వైవాహిక జీవితాన్ని మరింత ఆనందంగా మరియు బలంగా చేయడానికి దంపతుల మధ్య ప్రేమ చాలా అవసరం.
అలాగే వైవాహిక జీవితంలో ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండడం కూడా చాలా ముఖ్యం అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. దంపతులు ఎటువంటి రహస్యాలు లేకుండా మాట్లాడుకోవాలి. అలాగే ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా చాలా అవసరం. ఏదైనా చిన్న తప్పు జరిగిన కూడా భాగస్వామిని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు అని ఆచార్య చాణక్యరు అంటున్నాడు. ముందుగా తమ భాగస్వామ్య అభిప్రాయం తెలుసుకొని దానికి తగినట్లు నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం.
వైవాహిక జీవితంలో దంపతుల మధ్య అహంకారానికి చోటు ఇవ్వకూడదు. ప్రతి విషయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అహంకారాన్ని వదిలేస్తే వారి వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది. ఆ బంధం కూడా బలపడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఆ బంధం బలహీన పడిపోతుంది. నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం వైవాహిక జీవితం చాలా ఆనందంగా మరియు బలంగా ఉండాలంటే దంపతుల మధ్య ప్రేమ, నిజాయితీ, గౌరవం, నమ్మకం వంటివి ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య అహంకారం అస్సలు ఉండకూడదు.