Camphor Astro Tips: కర్పూరంతో సింపుల్ ఇలా చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి

Camphor Astro Tips
Camphor Astro Tips

Camphor Astro Tips: హిందూ మత శాస్త్రంలో పూజ చేయడానికి కర్పూరం చాలా ముఖ్యమైనది. కర్పూరానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిలో ఔషధ గుణాలతో పాటు శుద్ధి చేసే లక్షణాలు అలాగే ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో ఇవి బాగా సహాయం చేస్తాయి. కుటుంబ సభ్యుల జీవితంలో సానుకూల శక్తిని పెంచేందుకు కర్పూరం చాలా పవిత్ర వస్తువుగా పరిగణిస్తారు. కర్పూరం లేకుండా హారతి ఉండదు కాబట్టి పూజ కూడా చేయలేరు. ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజలో కర్పూరానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. పూజ పూర్తి అయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించి దేవతలకు హారతి ఇస్తారు. కర్పూరాన్ని భగవంతునికి మరియు భక్తునికి మధ్య వారాధిగా పరిగణిస్తారు. కర్పూరంతో హారతి ఇవ్వడం వలన దుష్టశక్తులు నాశనం అవుతాయని చాలామంది నమ్మకం.

ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యకలాపాలలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరంలో దైవిక రకమైన సువాసన కూడా ఉంటుంది. మంచి సువాసన కోసం కర్పూరాన్ని పర్సులో కూడా పెట్టుకుంటారు. దైవంతో ఇది బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది అని చాలామంది నమ్మకం. చెడు శక్తులను ఇంట్లో నుంచి తొలగించడానికి అలాగే ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి కర్పూరం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అత్యంత శక్తివంతమైన వస్తువులలో కర్పూరం కూడా ఒకటి. ఇది ఇంట్లో ఉండే ప్రతి కుల శక్తి, చేతబడి మరియు దుష్టశక్తి వంటి వాటిని తొలగించే సామర్థ్యం కలిగి ఉంటుంది.

దీనిని వెలిగించి ఇంట్లో వేదమంత్రాలను జపించడం వలన ఇది వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇది ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది అని చాలామంది నమ్మకం. జాతకంలో శని, శుక్ర, రాహువు మరియు కేతువు అంటే దోషాలు ఉన్నప్పుడు ప్రజలు దీనిని ఉపయోగిస్తారు. జాతకంలో ఈ గ్రహాలు సరిగ్గా లేని సమయంలో మీరు ఒక గిన్నెలో ఆవుపిడక తీసుకొని దాంట్లో నాలుగైదు కర్పూరాలను వేసి శనివారం, శుక్రవారం, అమావాస్య లేదా పౌర్ణమి వంటి ప్రత్యేక రోజులలో దీనినే సాయంత్రం సమయంలో వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన చెడు గ్రహాలు తొలగిపోయి మీకు సానుకూల ప్రభావాలు కలుగుతాయి. పర్సులో లేదా వాలెట్లో కర్పూరం పెట్టుకోవడం వలన అదృష్టం కలుగుతుంది అని చెప్తారు.

గమనిక: ఈ సలహా సూచనలు ప్రజా శంఖారావం వెబ్ సైట్ పాఠకుల కోసం మాత్రమే. ఎక్కడా కూడా వీటిని మేము ధ్రువీకరించడం లేదు. కేవలం శాస్త్రంలో మరియు సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని సలహాలు సూచనలు పాఠకులకు అందజేయాలన్న ఉద్దేశంతో మీకు ఈ సలహాలు ఇవ్వడం జరుగుతుంది. పైన తెలిపిన వాస్తు శాస్త్ర సలహాలు కేవలం సలహా మాత్రమే వాటిని పాటించడం పాటించకపోవడం పాఠకుల నిర్ణయం. మా వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now