Chanakya Niti: మనలో చాలామందికి పొదుపు చేసే అలవాటు ఉంటుంది. మనిషి పొదుపు చేయడం గురించి కూడా ఆచార్య చానిక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. కానీ ప్రతి ఒక్కరూ పొదుపు కూడా ఒకే విధంగా చేయలేరు. పొదుపు చేసే వారికి జీవితంలో ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు అనేది సత్యం. అలాగే నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం మనిషి జీవితంలో పొదుపు చేయటం అలవాటు చేసుకుంటే అతను త్వరలో ధనవంతులు అవుతాడు. అటువంటి వారికి జీవితంలో ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో జీవనశైలి విధానాలు ఒకే విధంగా ఉండవు. మన జీవన విధానాలు మన జీవితాంతం పై ఒక గొప్ప ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
మనిషి జీవితం సాఫీగా ముందుకు సాగాలంటే డబ్బు చాలా అవసరం. జీవితాంతం వరకు కూడా డబ్బు చాలా నమ్మకమైన తోడుగా నిలుస్తుంది. అయితే కొంతమందికి డబ్బు సమస్య ఉంటుంది. మీరు సంపాదించేది తక్కువ అయినా లేదా ఎక్కువ అయినా కూడా మీరు అందులో పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే మీకు జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. పొదుపు చేయడం కూడా ఒక కళ అని ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో చెప్తున్నాడు. కానీ ఈ పొదుపులో అందరూ కూడా ఒకే విధంగా చేయలేరు. కానీ జీవితంలో పొదుపు చేయడం ప్రారంభిస్తే మాత్రం ఖచ్చితంగా త్వరలో ధనవంతులు అవుతారు.
జీవితంలో ఎప్పటికీ కూడా డబ్బు కొరత లేకుండా ఉంటుంది. కాబట్టి అనవసరమైన వాటికి ఖర్చు చేయకూడదు. ఆలోచించకుండా ప్రతి దానికి డబ్బులను ఖర్చు చేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడు పేదరికంలోనే ఉంటాడు. అటువంటి వ్యక్తులు జీవితంలో ధనవంతులు కాలేరు. మీ చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి మీరు సంపాదించిన దానిలో కొంత పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. పొదుపు చేసిన డబ్బులను మంచి పెట్టుబడి పథకాలలో పెట్టాలి. అలాగే ఆ పెట్టుబడి పథకాలు రిస్క్ లేకుండా ఉంటే మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి.