Chanakya Niti: కొంతమంది ఏ చిన్న కష్టం వచ్చినా సరే చాలా భయపడిపోతారు. వాటిని ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. అయితే ఆచార్య చానికుడు నీతి శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం కష్ట సమయంలో మనిషి భయపడకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి.ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనిషి భయపడకూడదు అని ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా మనిషి చాలా దృఢంగా వాటిని ఎదుర్కోవాలి. ఆచార్య చాణిక్యుడిని అందరూ కౌటిల్యుడు అలాగే విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఆచార్య చాణక్యుడు తన లక్ష్యాన్ని సాధించడం కోసం అంకితభావంతో పనిచేయడంతో పాటు కృషి పట్టుదలతో కూడా ఆ పనిని పూర్తి చేస్తాడు.
ఇప్పటి ప్రజలు కూడా ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో పొందుపరిచిన విధానాలను అనుసరిస్తున్నారు. అతను చెప్పిన దాని ప్రకారం ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనిషి భయపడకూడదు. వాటిని చాలా దూరంగా ఎదుర్కోవాలి. శాస్త్ర నియమాలను అనుసరించే విద్యను పొందిన వాళ్లు తప్పు ఒప్పుల తేడాలను అలాగే మంచి చెడుల వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతారు. ఇటువంటి జ్ఞానం పొందిన వ్యక్తులు జీవితంలో విజయం సాధిస్తారు. జ్ఞానం అన్ని దుఃఖాలకు పరిష్కార మార్గం. లక్ష్యం సాధించాలంటే జ్ఞానం ఉండాల్సిందే. కాబట్టి ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. తమకు గౌరవం లేని చోట ఉండకూడదు.
అలాగే మనుషులు ఉపాధి మార్గాలు లేని చోట తమ స్నేహితులు లేని చోట కూడా నివసించకూడదు అని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. ప్రతి మనిషికి కూడా ఎప్పుడు ఏ సమయంలో కష్టాలు వస్తాయో తెలియదు కాబట్టిఆకస్మాత్తుగా వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి మనిషి ఎల్లప్పుడూ డబ్బును పొదుపు చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో మనిషి విజయం సాధించడానికి అలాగే డబ్బును సంపాదించడానికి అనేక నియమాలను పొందుపరిచాడు.