Mobile Phone: చేతిలో మొబైల్ ఉంటుంది. అందులో నెట్ వర్క్ పనిచేస్తుంది. సరిపడేంత బ్యాలెన్స్ కూడా ఉంటుంది. సిగ్నల్ కూడా సరిపడేంత ఉంటుంది. వాటిని ఉపయోగించి మనం ఎవరికయినా లొకేషన్ షేర్ చేయడానికి అవకాశం ఉంది. మనం ఎక్కడ ఉంటామో కూడా లొకేషన్ ద్వారా తెలియజేస్తాం.
చేతిలో మొబైల్ మాత్రమే ఉంది. బ్యాలెన్స్ అయిపోయింది. నెట్ వర్క్ లేని ప్రదేశంలో ఉన్నాం. లేదంటే అనుకోకుండా నెట్ వర్క్ లేని ప్రదేశంలో మనం వెళుతున్న వాహనం ఆగిపోయింది. లేదంటే అకస్మాత్తుగా నెట్ వర్క్ కుప్పకూలిపోయింది. అప్పుడే మనం ఉంటున్న ఇంటికి ఎవరో వస్తామన్నారు. వారికి మన లొకేషన్ పంపాలి అప్పుడు పరిస్థితి ఏమిటి. ఉంది. వీటన్నిటికీ పరిస్కారం ఉంది. చేతిలో మొబైల్ ఉండి బ్యాలెన్స్, నెట్ వర్క్ లేకపోయినా మనం లొకేషన్ పంపడానికి మన మొబైల్ లోనే ఆ అవకాశం ఉంది. అది ఒక్క కేవలం ఐ ఫోన్ తోనే సాధ్యమవుతుంది. అది ఎలా అంటే …..
ఐఫోన్ లో ముందుగా సెట్టింగ్ లో పలు సవరణలు చేసుకోవాలి. మొదట ఐఫోన్ లో సెట్టింగ్ ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్న సెర్చ్ బార్ లో
“Privacy and Security” టైపు చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే లొకేషన్ సర్వీసెస్ అని కనబడుతుంది. దాని పై భాగంలో ఓపెన్ చేయాలి. ఆ తరువాత కంపాస్ యాప్ కనబడుతుంది. ఆ యాప్ ను ఓపెన్ చేస్తే అక్కడ సున్నా నుంచి మొదలుకొని 360 వరకు డిగ్రీలు కనబడుతాయి. ఆ డిగ్రీ లలో మీరు ఉండే ప్రదేశం కనబడుతుంది. మీరు ఉన్న ప్రదేశం కనబడగానే ఆ లొకేషన్ ను షేర్ చేస్తే సరిపోతుంది.