Tholi Ekadashi: తొలి ఏకాదశి జులై 6, 2025 ఆదివారం రోజున అందరూ జరుపుకుంటారు. తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన పండుగ రోజు. ఈరోజు భక్తులందరూ ఉపవాసం ఆచరించి పూజలు కూడా చేస్తారు. మనదేశంలో హిందూ సంప్రదాయంలో ఉన్న చాలా ముఖ్యమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ కూడా ఒకటి. తొలి ఏకాదశి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ దేవాశయని ఏకాదశి పండుగను ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున అందరూ జరుపుకుంటారు. అయితే ఈ ప్రత్యేక రోజున నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడని అందరి నమ్మకం. దీనిని చాతుర్మాసం అని అంటారు.
అయితే అందరూ కూడా ఈ ప్రత్యేక రోజున ఉపవాసం ఆచరించి శ్రీమహావిష్ణువుకు పూజలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని నమ్ముతారు. ఈరోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజగదిని కూడా శుద్ధి చేసుకోవాలి. అలాగే తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించడం శ్రేష్టముగా చెప్తారు. లక్ష్మీనారాయణ పటాన్ని శుభ్రం చేసి వాటికి గంధం మరియు కుంకుమ బొట్లతో అలంకరించాలి.
Also Read: పూజ గదిలో చాలామంది ఈ వస్తువు పెడతారు.. కానీ ఈ వస్తువు పూజ గదిలో ఉంటే ఆర్థిక అనర్ధాలు తప్పవు
అలాగే తొలి ఏకాదశి రోజున మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఒత్తులను విడిగా వేసి పూజ మందిరంలో దీపం వెలిగించాలి. అయితే తొలి ఏకాదశి రోజున మీరు పూజ ప్రారంభించే ముందు శ్రీ మహా విష్ణువుతో ఈ వ్రతాన్ని నేను పూర్తి భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి ఆచరిస్తాను అని సంకల్పం చేసుకోవాలి. ఆయనకు ఇష్టమైన పూలను అలాగే తులసి దళాలను ఉంచి పూజ చేయాలి. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు అంటే చాలా ఇష్టం. కానీ ఈ రోజున వాటిని కోయకూడదు. ముందు రోజే పూజ కోసం వీటిని రెడీగా పెట్టుకోవాలి.