SIM Card: సిమ్ కార్డు కావాలంటే.. ఈ నిబంధనలు తప్పనిసరి.. ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డులపై కొత్త రూల్స్

SIM Card
SIM Card

SIM Card: మొబైల్ ద్వారా నేరాలు రోజు, రోజుకు పెరిగిపోతున్నవి. అంతే కాదు సైబర్ నేరగాళ్లు ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొని కొత్త నిబంధనలను అమలుల్లోకి తీసుకువచ్చింది. కొత్తగా మొబైల్ సిమ్ కొనేవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆ నిబంధనలు ఈ విదంగా ఉన్నాయి.

భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనల మేరకు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ సిమ్ కొన్నవారు తప్పనిసరిగా కేవైసీ నమోదు చేయించుకోవాలి. గతంలో కూడా ఈ నిబంధన ఉండేది. కొత్తగా సిమ్ కొనేవారు కేవైసీ నమోదులో ఇంటిపేరు తో సహా పూర్తి పేరు నమోదు చేయాలి. అదే విదంగా మొబైల్ నంబర్, ఇంటి చిరునామా పూర్తి వివరాలతో నమోదు చేయాలి. సిమ్ కొన్న వినియోగదారుడి వివరాలన్నీ కూడా ఆఫ్ లైన్ లేదంటే సిమ్ కొన్న కంపెనీ వెబ్సైట్ లో నమోదు చేయడానికి అవకాశం ఉంది.

కేవైసీ లో వివరాలను పూర్తి చేయడానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు లలో ఎదో ఒకటి ఉండాలి. ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో వెంట ఉండాలి వీటితో ఆన్ లైన్ లో కేవైసీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కేవైసీ నమోదు కానీ మొబైల్ సిమ్ లు పనిచేయవు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now